BigTV English
Advertisement

Sivakarthikeyan: ఆ సినిమా నా వల్లే ఫ్లాప్ అయ్యింది.. తప్పు ఒప్పుకున్న శివకార్తికేయన్

Sivakarthikeyan: ఆ సినిమా నా వల్లే ఫ్లాప్ అయ్యింది.. తప్పు ఒప్పుకున్న శివకార్తికేయన్

Sivakarthikeyan: తమిళ యంగ్ హీరో శివకార్తికేయన్ ఆడియన్స్‌కు నచ్చే కథలను సెలక్ట్ చేసుకుంటూ.. ఎక్కువగా పక్కింటబ్బాయి పాత్రలు చేస్తూ అందరికీ దగ్గరయ్యింది. శివకార్తికేయన్ సినిమా అంటే ఎంటర్‌టైన్మెంట్ ఉంటుంది అని ఆడియన్స్ కచ్చితంగా నమ్ముతారు. అలాంటి తను రూటు మార్చి ఒక ఎమోషనల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే ‘అమరన్’. మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ‘అమరన్’ ప్రమోషన్స్‌లో భాగంగా తాను ఎంచుకోవడం వల్లే ఒక సినిమా ఫ్లాప్ అయ్యిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు శివకార్తికేయన్.


తెలుగు దర్శకుడితో

కోలీవుడ్‌లో యూత్‌ఫుల్ సినిమాలకు శివకార్తికేయన్ (Sivakarthikeyan) కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాడు. హీరో ఒక కాలేజ్ స్టూడెంట్ అయితే దానికి శివకార్తికేయనే కరెక్ట్ అని చాలామంది మేకర్స్ భావిస్తూ ఉంటారు. అలా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించి యూత్‌ను బాగా ఆకట్టుకున్న తర్వాత ఒక తెలుగు దర్శకుడితో పనిచేయడానికి శివకార్తికేయన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తనే కేవీ అనుదీప్. అప్పటికే అనుదీప్.. తెలుగులో ‘జాతిరత్నాలు’ అనే మూవీని డైరెక్ట్ చేసి మొదటి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. అంతే కాకుండా అనుదీప్ ఆఫ్ స్క్రీన్ ఎంటర్‌టైన్మెంట్ కూడా విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే తెలుగులో సక్సెస్ సాధించగానే తమిళంలో అడుగుపెట్టాలనుకున్నాడు. దానికి శివకార్తికేయన్‌ను హీరోగా ఎంచుకున్నాడు.


Also Read: ప్రభాస్ లుక్ లీక్ పై ఆగ్రహం… లీక్ చేసిన వాళ్లను పట్టుకున్న వారికి “కన్నప్ప” టీం బంపర్ ఆఫర్

చేయకుండా ఉండాల్సింది

శివకార్తికేయన్, కేవీ అనుదీప్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమానే ‘ప్రిన్స్’ (Prince). ఈ మూవీ 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ప్రిన్స్’కు మిక్స్‌డ్ టాక్ లభించింది. కానీ ఇందులోని కామెడీని మాత్రం చాలామంది ట్రోల్ చేశారు. అసలు ఇది కామెడీనా అంటూ మూవీపై, డైరెక్టర్ అనుదీప్‌పై నెగిటివ్ కామెంట్స్ చేశారు. అలా ఈ సినిమా చాలా నెగిటివిటీని ఎదుర్కుంది. తాజాగా ‘అమరన్’ (Amaran)మూవీ ప్రమోషన్స్‌లో ‘ప్రిన్స్’ ఫెయిల్యూర్‌పై స్పందించాడు శివకార్తికేయన్. తను కాకుండా మరే ఇతర యంగ్ హీరో అయినా ‘ప్రిన్స్’ సినిమా చేసుంటే దానికి అంత నెగిటివ్ టాక్ వచ్చేది కాదేమో అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయినా ఈ సినిమాలో శివకార్తికేయన్ నటనను ఎంజాయ్ చేసినవారు కూడా ఉన్నారు.

అలా చేసుంటే బాగుండేది

శివకార్తికేయన్ సినిమాలు అంటే ఎలా ఉండాలో ప్రేక్షకుల్లో ఆల్రెడీ ఒక అంచనా ఉంటుంది. అలాంటి సమయంలోనే వారి ముందుకు ‘ప్రిన్స్’ వచ్చింది. ఇలాంటి కామెడీ సినిమాను శివకార్తికేయన్ ఎలా ఒప్పుకున్నాడు అని చాలామంది ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారు. అదే కథను అనుదీప్ (KV Anudeep).. వేరే యంగ్ హీరోతో తెరకెక్కించుంటే ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేవారని, తనను ఆ పాత్రలో ప్రేక్షకులు ఊహించుకోలేకపోయారని అన్నాడు. అయినా ‘ప్రిన్స్’ ఫ్లాప్ అయినా కూడా వెంటనే ‘మావీరన్’ అనే డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్‌తో వచ్చి ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు శివకార్తికేయన్. ఇప్పుడు ‘అమరన్’తో రికార్డులు సృష్టిస్తున్నాడు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×