BigTV English

Vastu Tips: ఈ వాస్తు నియమాలు పాటిస్తే ఇంట్లో డబ్బుకు ఏ లోటూ ఉండదు

Vastu Tips: ఈ వాస్తు నియమాలు పాటిస్తే ఇంట్లో డబ్బుకు ఏ లోటూ ఉండదు

Vastu Tips: మన ఇంట్లో ఉండే వస్తువులు వాస్తుతో ముడపడి ఉంటాయి. ఇంట్లో మనం తెలిసీ తెలియకుండా చేసే పనులు వాస్తు దోషాలను కలిగిస్తాయి. వాటి వల్ల మనం ఆర్థిక, అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు సంతోషకరమైన జీవితం గడపాలని అనుకుంటారు. అందుకు అవసరమయ్యే డబ్బు సంపాదన కోసం నిరంతరం కష్టపడతారు. కానీ డబ్బు సంపాదించడంలో కొంతమంది విజయం సాధిస్తారు. మరి కొంద మంది మాత్రం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కుంటారు.


వాస్తు దోషాల కారణంగానే వ్యక్తి ఆర్థిక, మానసిక శారీరక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. వాస్తు దోషం అంటే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రావడం. పలితంగా ఇంట్లో ఉన్న వారు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి వాస్తు దోషాలను తొలగించి ఇంట్లో ఆర్థిక శ్రేయస్సును తెచ్చే కొన్ని శుభకరమైన వాస్తు నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈశాన్యంలో బరువు:
మీ ఇంట్లో నిత్యం ఎవరో ఒకరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారంటే అందుకు వాస్తు దోషం కూడా కారణం కావచ్చు. ఉదాహరణకు మైగ్రేన్ ఇంటి ఈశాన్య దిశకు సంబంధించింది. ఈ దిశలో ఏదైనా భారీ నిర్మాణాలు అంటే మెట్లు, దుకాణం, వంటగది వంటివి ఉంటే అప్పుడు అలాంటి సమస్య వచ్చే అవకాశం ఉంది. వాస్తు నియమం ప్రకారం ఇలాంటివి ఈశాన్యంలో ఉంచకూడదు. అక్కడ నుండి వాటిని తీసివేయడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. నీటితో నిండిన రాగి లేదా ఇత్తడి లేదా వెండి కలశాన్ని ఈనాన్యంలో ఉంచండి. ఈ ప్రదేశంలో గంగాజలం ఉంచండి. అంతే కాకుండా తులసి మొక్కను నాటడం కూడా మంచిదే. ముఖ్యంగా ఈశాన్య స్థలాన్ని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు బరువు ఉండకుండా చూసుకోవడం మంచిది.
డబ్బు నిలవాలంటే:
ఇంట్లో మూడు తలుపులు వరుసగా ఉండకూడదు. దీని వల్ల పాజిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఎంత సంపాదించినా కూడా డబ్బులు నిలవవు. ఏదో ఒక రూపంలో చేతికందిన డబ్బు ఖర్చయిపోతుంది. అవసరం ఉన్నప్పుడు మాత్రమే మెయిన్ గేట్‌ను తెరవండి. ఇంటి మెయిన్ గేట్‌ను ఎప్పుడూ తెరచి ఉంచకండి. ఈ విధంగా చేస్తే డబ్బుకు లోటు ఉండదు.

Also Read:లక్ష్మీ అనుగ్రహంతో ఈ 3 రాశుల వారికి గోల్డెన్ టైం రానుంది


పూజ గది:
ఇంట్లోని పూజగదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. విరిగిన, పగిలిన విగ్రహాలు, చిరిగిపోయిన దేవతలు చిత్రపటాలు, ఎండిపోయిన పూల వంటివి ఎప్పటికప్పుడు తీసివేయాలి. నిత్యం దీపారాధన జరిగే ఇంట్లో సకల దేవతలు కొలువై ఉంటారని చెబుతుంటారు. అందుకే ఇంట్లోని పూజ గదిలో పూజ చేసి దీపం వెలిగించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. లేకపోతే దేవుళ్లు సంతృప్తి చెందరు. ఇంటిని కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. లేకుంటే ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఇంట్లోని అద్దాలు, కిటికీలను ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచుకోండి. లేకుంటే అవి డబ్బు సమస్యలను తెచ్చిపెడతాయి. ఇంట్లోని గోడ గడియారం మురికిగా ఉంటే దానిని శుభ్రపరచండి లేకుంటే అది ప్రతికూల విషయాలను ఆకర్షిస్తుంది.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×