BigTV English

Chadrababu Speech: అమరావతి మహిళా రైతుల బాత్రూమ్‌ల‌పై డ్రోన్లు ఎగరవేశారు: చంద్రబాబు

Chadrababu Speech: అమరావతి మహిళా రైతుల బాత్రూమ్‌ల‌పై డ్రోన్లు ఎగరవేశారు: చంద్రబాబు

CM Chadrababu Speech at Assembly: గత వైసీపీ పాలనలో ఏపీ ప్రజలు మానసికంగా, శారీరకంగా ఎంతో వేదనను అనుభవించారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పోలీసుల అండతో వైసీపీ నేతలు ప్రజాస్వామ్య పునాదులపై దాడులు చేశారన్నారు. శాసన మండలిలో 3 రాజధానుల బిల్లు సమయంలో దుర్మార్గంగా ప్రవర్తించారని ఆయన అన్నారు. గురువారం అసెంబ్లీలో ఏపీలో గత ఐదేళ్ల పాలనలో శాంతిభద్రతలపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు.


‘గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యమయ్యింది. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు పోలీసులు ఆయుధంగా పనిచేశారు. వైసీపీ నేతలతో కుమ్మక్కై నిబంధలను ఉల్లంఘించారు. అధికార పార్టీ నేతలతో విభేదిస్తే పోస్టింగ్ లు ఇవ్వకుండా వీఆర్ లో పెట్టేవారు. గత ఐదేళ్లపాటు వీఆర్ లో ఉన్న అధికారులు కూడా ఉన్నారు. ఏపీలో పోలీస్ వ్యవస్థను పూర్తిగా విధ్వంసం చేశారు. బాబ్లీ కేసు తప్ప నాపై గతంలో ఎప్పుడు కూడా కేసులు లేవు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నాపై 17 కేసులు, పవన్ కల్యాణ్ పై 7 కేసులు పెట్టారు. ప్రతిపక్ష నేతలను అణచివేసేందుకు ప్రయత్నించారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై 60కి పైగా కేసులు నమోదు చేశారు. ప్రస్తుత హోంమంత్రి అనిత, స్పీకర్ అయ్యన్నపాత్రుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వేధించారు. రఘురామకృష్ణరాజును లాకప్ లో పెట్టి చిత్రహింసలకు గురి చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు చూసి నాటి సీఎం జగన్ మోహన్ రెడ్డి పైశాచికానందం పొందారు. రాజకీయ పోరాటం చేసిన ప్రతిఒక్కరిపై కేసులు నమోదు చేశారు. వారిని బయటకు రానీయకూడదనుకున్నారు. కానీ, ప్రజలు నేరుగా అసెంబ్లీకి పంపించారు’ అని చంద్రబాబు అన్నారు.

Also Read: జగన్‌పై హోంమంత్రి ఆగ్రహం, ఆ.. దమ్ము లేదా?


‘అమరావతి మహిళా రైతుల బాత్రూమ్‌ల‌పై డ్రోన్లు ఎగరవేశారు. గడిచిన ఐదేళ్లలో పెద్ద ఎత్తున మహిళలు మిస్సయ్యారు. ఏపీలో గంజాయి లేని గ్రామం లేదు. దేవాలయాలపై దాడులు చేశారు, దోపిడీలు చేశారు. ఒక్కసారైనా గంజాయిపై జగన్ సమీక్ష చేశారా? జగన్ కోడికత్తి డ్రామా, గులకరాయి డ్రామాలు ఆడారు తప్ప చేసిందేమీలేదు’ అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×