Budha Gochar 2025: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలలో చంద్రుడు, బుధుడు తరుచుగా తమ రాశులను మార్చుకుంటారు. బుధుడిని గ్రహాలకు యువరాజుగా చెబుతారు. బుధుడు తెలివితేటలు, తర్కం, గణితం, వ్యాపారానికి బాధ్యత వహించే గ్రహంగా పరిగణించబడతారు. 12 రాశుల్లో 2 రాశులైన మిథున, కన్య రాశులకు అధిపతి బుధుడు. తెలివి తేటలకు దేవుడైన బుధుడు ఫిబ్రవరి 11వ తేదీన మధ్యాహ్నం 12:41 గంటల ప్రాంతంలో శని గ్రహం కుంభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. శని రాశిలో బుధుడి సంచారం వల్ల 12 రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా 3 రాశుల వారు ఎక్కువగా లాభాలు పొందుతారు. మరి ఆ రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి:
బుధుడి సంచారం వృషభ రాశి వారికి చాలా మేలు చేస్తుంది. ఫలితంగా ఫిబ్రవరి 11 నుండి మీకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. బుధ సంచారం మీ పదవ ఇంట్లో జరుగుతుంది. వృషభ రాశి యొక్క రెండు, ఐదవ ఇంటికి అధిపతి బుధుడు. ప్రస్తుతం బుధుడి సంచారం మీ వృత్తి, వ్యాపారంలో కూడా వృద్ధి కలుగుతుంది. అంతే కాకుండా మీరు కొత్త ఉద్యోగం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు మీ ఆఫీసుల్లో కూడా గొప్ప విజయాలను సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కూడా సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. ఉన్నత ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఇది చాలా మంది సమయం. వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది.
ధనస్సు రాశి:
ధనస్సు రాశి వారికి బుధుడు ఏడవ , పదవ ఇంటికి అధిపతి . ఇది మీ మూడవ ఇంట్లో ఉంటే అద్భుత ప్రయోజనాలు అందుకుంటారు. మీరు గత పెట్టుబడుల నుండి అనేక లాభాలు కలుగుతాయి. అంతే కాకుండా మీ వృత్తి వ్యాపారంలో కూడా పెరుగుదల చాలా ఉంటుంది. ఆర్థికంగా లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. జీవితంలో ధన ప్రవాహం కూడా పెరుగుతుంది. మీ మాటల్లో మాధుర్యం ఉంటుంది . మీ కుటుంబ సభ్యుల నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో మీరు విహార యాత్రలకు వెళ్లే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం కూడా మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది.
Also Read: సూర్యుడి సంచారం.. ఫిబ్రవరి 7 నుండి వీరు జాక్ పాట్ కొట్టినట్లే
తులా రాశి:
తులా రాశి వారికి ఫిబ్రవరి 11 నుండి అన్నీ మంచి రోజులే. మీ ఐదవ ఇంట్లో బుధుడి సంచారం జరగనుంది. విద్యా రంగంలో కూడా మీరు మంచి విజయాన్ని సాధిస్తారు. అంతే కాకుండా మీలో విశ్వాసం చాలా వరకు పెరుగుతుంది. డబ్బు ఆదా చేయడంలో కూడా మీరు విజయం సాధిస్తారు. పెండింగ్ పనులను చాలా వరకు పూర్తి చేస్తారు. అంతే కాకుండా మీ ఇంట్లో శుభ కార్యాలు కూడా జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కొత్త ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి ఇది చాలా మంచి సమయం. విద్యార్థులు శుభ వార్తలు అందుకునే అవకాశాలు చాలా కూడా ఎక్కువగా ఉన్నాయి.