BigTV English

Prabhas : డెసిషన్ తీసేసుకున్న ప్రభాస్.. అంతా సెట్ అయ్యినట్లేనా..

Prabhas : డెసిషన్ తీసేసుకున్న ప్రభాస్.. అంతా సెట్ అయ్యినట్లేనా..

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. గతంలో వచ్చిన సినిమాలు వేరు.. బాహుబలి తర్వాత వరుసగా ప్లాన్ ఇండియా సినిమాలనే ఎంపిక చేసుకుంటున్నాడు. గతేడాది కల్కి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన డార్లింగ్ ఈ ఏడాది వరుస సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాది గాను ముందుగా డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో వచ్చిన రాజా సాబ్  మూవీతో ఆడియన్స్ ను  పలకరించబోతున్నాడు. ఆ తర్వాత ఫౌజీ సినిమాను త్వరగా పూర్తి చేసి ఏడాది చివరిలో కల్లా సినిమాను రిలీజ్ చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత స్పిరిట్ మూవీని పట్టాలెక్కించేలా ప్రభాస్ డేట్స్ ను సెట్ చేసుకున్నట్లు ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. మరి ప్రభాస్ ఏ సినిమాలకు ఎన్ని కాల్షీట్లు ఇచ్చారో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


డార్లింగ్ ప్రభాస్ రేంజ్ బాహుబలి తర్వాత పూర్తిగా మారిపోయింది. రెమ్యూనరేషన్ భారీగా పెంచిన ప్రభాస్..  వరుసగా పాన్ ఇండియా సినిమాల్లోనే నటిస్తున్నాడు. గతంలో వచ్చిన సలార్ మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ మూవీని తెరకేక్కించారు. ఆ తర్వాత గత ఏడాది కల్కి మూవీతో మరో హిట్ మూవీని తన ఖాతాలో వేసుకున్నాడు. పురాణాల కథ ఆధారంగా వచ్చిన మూవీకి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ ఏడాది ముందుగా రాజా సాబ్ మూవీతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు. డైరెక్టర్ మారుతి  దర్శకత్వంలో మూవీ రాబోతుంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేశారు. దాదాపు టాకీ పార్ట్ పూర్తి చేసుకుందని టాక్.. త్వరగా ఆ మూవీని థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

రాజా సాబ్ షూటింగ్ పూర్తి అయ్యిందని టాక్.. ఆ తర్వాత హనురాఘపూడి కాంబినేషన్ లో ఫౌజీ మూవీని చేస్తున్నాడు. ఈ మూవీకి 60 రోజుల కాల్షీట్‌లు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక్కడ టాకీ పూర్తయ్యాక ఫారిన్‌లో పాటలను షూట్‌ చేయాలని ప్లాన్‌ చేస్తోంది ఫౌజీ టీమ్‌.. ఆ తర్వాత స్పిరిట్‌కి ఫుల్‌ కాల్షీట్‌ కేటాయించాలన్నది ప్లాన్‌.. ఇలా ప్లాన్ చేసుకోవడం వల్ల సినిమాల సంబందించిన లుక్ లో తేడాలు రాకుండా ఉంటుందని డార్లింగ్ డెసిషన్ తీసుకుంన్నారట.. అయితే ఫౌజీ, స్పిరిట్‌ టైమ్‌లో అటూ ఇటూ చూడరన్నమాట యంగ్‌ రెబల్‌స్టార్‌.. ఈ మూవీల తర్వాత సలార్ కు సీక్వెల్ గా శౌర్యాంగపర్వం స్టార్ట్ కావడానికి మరింత సమయం పడుతుందనే క్లారిటీ వచ్చేసింది.. ఆ తర్వాత కథ సిద్ధం చేస్తే నాగ్ అశ్విన్ తో కల్కి మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్ళనున్నాడు.. మొత్తానికి ఈ ఏడాది అయితే ప్రభాస్ మూవీల లైనప్ మాత్రం అదిరిపోయింది. మరి ఏ మూవీ ఎలాంటి రికార్డ్ లను బ్రేక్ చేస్తుందో చూడాలి.. ఈ మూవీల తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చే ప్లాన్ లో ప్రభాస్ ఉన్నారని ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది.. మరి దీనిపై ప్రభాస్ క్లారిటి ఇవ్వాల్సి ఉంది..


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×