E-Paper
Advertisement

Budhaditya Rajyog 2024: సూర్యుడు, బుధుడి సంచారం.. వీరు ధనవంతులయ్యే టైం వచ్చేసింది

Budhaditya Rajyog 2024: సూర్యుడు, బుధుడి సంచారం.. వీరు ధనవంతులయ్యే టైం వచ్చేసింది
Advertisement

Budhaditya Rajyog 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల రాకుమారుడు బుధుడు సెప్టెంబర్ 4 ఉదయం 11:52 గంటలకు సింహరాశిలోకి ప్రవేశించాడు. బుధుడు సెప్టెంబర్ 23 వరకు సింహరాశిలోనే ఉంటాడు. సింహరాశిలో సూర్యుడు, బుధుడి కలయిక వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడింది. ఈ రాజయోగం 12 రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా 4 రాశులపై బుధాదిత్య రాజయోగం ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ రాశుల వారిపై బుధుడి ప్రభావం వల్ల సానుకూల మార్పులు కనిపిస్తాయి. ఆ రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి:
సూర్యునితో పాటు బుధుడు సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగ ప్రభావం వల్ల మేష రాశి వారికి కెరీర్ పరంగా మంచి అవకాశాలు పొందుతారు. సమాజంలో గౌరవం కూడా లభిస్తుంది. అలాగే విద్యార్థులు వివిధ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా గడుపుతారు. పెండింగ్ పనులు ఈ సమయంలో పూర్తి చేస్తారు. మీకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది.

Advertisement

సింహ రాశి :
సింహరాశి సూర్యుడి యొక్క సొంత రాశిగా చెబుతారు. బుధుడు సింహ రాశిలోకి ప్రవేశించాడు. సింహ రాశిలో బుధుడి సంచారం వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. దీని ప్రభావం వల్ల సింహ రాశి వారికి జీవితంలో విజయావకాశాలు పెరుగుతాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న వారి పనులు పూర్తి చేస్తారు. న్యాయపరమైన విషయాల్లో కూడా విజయం సాధిస్తారు. ఆఫీసర్ల నుంచి ప్రశంసలు అందుకుంటారు.

Also Read: సెప్టెంబర్ 8 నుంచి 14 వరకు వారఫలాలు

Advertisement

తులా రాశి:
బుధాదిత్య రాజయోగ ప్రభావం వల్ల తులా రాశి వారి జీవితాలలో అనేక పనులు నెరవేరుతాయి. ఈ సమయం ఈ వ్యక్తుల ప్రేమ జీవితానికి చాలా మంచిది. ఒంటరి వ్యక్తులకు వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. మీరు అనుకున్న పనులను పూర్తి చేస్తారు.

కుంభ రాశి:
ప్రస్తుతం కుంభరాశిలో శని సాడే సతి కొనసాగుతోంది. శని తిరోగమనం వల్ల కుంభరాశి జీవితం ఇబ్బందుల్లో పడింది. ఇదిలా ఉంటే బుధాదిత్య రాజయోగం కొద్దిరోజులుగా వారికి ఉపశమనం కలిగిస్తోంది. ఈ వ్యక్తులు బుధుడి యొక్క సంచార కాలంలో వారి పెండింగ్ పనుల నుంచి ఉపశమనం పొందుతారు. ఊహించని ధనలాభం కడూడా వీరికి కలుగుతుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×