BigTV English

NTR: అసలు సిసలు అనిమల్ తో ఎన్టీఆర్.. ఈ కాంబో సెట్ అయితే నా సామీ రంగా..

NTR: అసలు సిసలు అనిమల్ తో ఎన్టీఆర్.. ఈ కాంబో సెట్ అయితే నా సామీ రంగా..

NTR:  మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం  దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మధ్యనే షూటింగ్ పూర్తిచేసుకున్న దేవర.. సెప్టెంబర్ 27 న రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన ఎన్టీఆర్..  ఇంటర్వ్యూలు ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.


రేపు అనగా సెప్టెంబర్ 10 న దేవర సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు  చేసారు. ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో జరగనుండడంతో నిన్ననే ఎన్టీఆర్ ముంబైకు చేరుకున్నాడు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా ట్రైలర్ రాబోతుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు అనుకోని విధంగా ఒక అద్భుతమైన ఫోటో సోషల్ మీడియాలో కనిపించింది.

టాలీవుడ్ లో కొన్ని కాంబోలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. స్టార్ హీరోలు- స్టార్ డైరెక్టర్ల కాంబోల కోసం ఫ్యాన్స్ ఎప్పుడు ఎదురుచూస్తూ ఉంటారు. ఇక  అలా ఫ్యాన్స్ అందరు ఎదురుచూస్తున్న కాంబినేషన్ లిస్ట్ లో ఎన్టీఆర్- సందీప్  రెడ్డి వంగా  ఉన్నారు. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన సందీప్ రెడ్డి వంగా.. మొదటి సినిమాతోనే టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు.


అదే సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేసి అక్కడ కూడా స్టార్ డైరెక్టర్ గా  మారాడు.  ఇక ఈ సినిమా తరువాత  బాలీవుడ్ లో అనిమల్  సినిమాకు దర్శకత్వం వహించి టాలీవుడ్ డైరెక్టర్ సత్తా ఏంటో బాలీవుడ్ లో నిరూపించాడు.   ఇక ఇప్పుడు  స్పిరిట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఇక  టాలీవుడ్ స్టార్ హీరోలు నిర్మొహమాటంగా.. కొంతమంది స్టార్ డైరెక్టర్ల నేతృత్వంలో నటించాలని మీడియా ముందే చెప్పుకోస్తారు. అలాంటి డైరెక్టర్స్ లో సందీప్ రెడ్డి కూడా ఉన్నాడు. ఇక ఇప్పుడు  ఎన్టీఆర్- సందీప్ ముంబైలో కనిపించడం.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఏంటి.. నిజామా అంటే అవును నిజమే. ఎన్టీఆర్, సందీప్  కలిసి మాట్లాడుకుంటున్న ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అయితే వీరు ఎప్పుడు, ఎందుకు కలిశారు అనేది తెలియరాలేదు. వైట్ షర్ట్, గ్రే కలర్ ప్యాంట్ లో   సందీప్ కనిపించగా.. బ్లూ జీన్స్, వైట్ టీ షర్ట్ పై రెడ్ చెక్స్  షర్ట్ వేసుకొని.. ఎన్టీఆర్ చాలా స్టైలిష్  గా కనిపించాడు.

స్పిరిట్ తరువాత సందీప్, ఎన్టీఆర్ తో సినిమా ప్లాన్ చేశాడా.. ?  అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు  అసలు సిసలు అనిమల్ తో ఎన్టీఆర్.. ఈ కాంబో సెట్ అయితే నా సామీ రంగా.. బాక్సాఫీస్ కు రక్త కన్నీరే అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ కాంబో భవిష్యత్తులో ఏమైనా కలుస్తుందేమో  చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×