శ్రీ విష్ణు హీరోగా చేసిన సింగిల్ మూవీలో హీరోయిన్ ఇవానా నోటితో దీపాన్ని ఆర్పే సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీన్నే ఇప్పుడు instagram లో ఎంతమంది అమ్మాయిలు రీల్స్ చేస్తున్నారు. పవిత్రమైన దీపాలను నోటితో గాలిని ఊది ఆర్పేస్తున్నారు. ఇలా నోటితో గాలిని ఊదడం ద్వారా దీపాన్ని లేదా కొవ్వొత్తిని ఆర్పడం మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలా ఆర్పడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయని వివరిస్తుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం అగ్ని ఆగ్నేయానికి సంబంధించినది. అగ్నికి సంబంధించిన ప్రతిది ఆగ్నేయ దశలోనే ఉంచాలని చెబుతారు. అదే శుభప్రదం కూడా. మన శరీరం కూడా నీరు, గాలి, ఆకాశం, భూమి, అగ్ని అనే ఐదు అంశాలతో తయారైందని వివరిస్తారు. అయితే మన శరీరంలో అగ్ని చాలా తక్కువ మొత్తంలోనే ఉంటుంది. అది కూడా మన జీర్ణవ్యవస్థతో ముడిపడి ఉంటుంది. మనకు ఆహారం జీర్ణం అవ్వాలంటే అగ్ని అంటే వేడి అవసరమే.
సూర్యుడు కూడా అగ్నికి చిహ్నంగా చెప్పుకుంటారు. అతడు తన ప్రకాశంతో ప్రపంచాన్ని వెలిగిస్తాడు. అగ్ని అనే మూలకం జీవితంలో మనుషుల జీవితంలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అగ్నికి దేవతలతో సమానమైన స్థానాన్ని ఇచ్చారు.
వాస్తు శాస్త్రం ప్రకారం దేవుని దగ్గర వెలిగించిన దీపాన్ని నోటి నుంచి వచ్చిన గాలి ఊది ఆర్పడం మాత్రం ఏ మాత్రం మంచిది కాదు. దేవుడి దగ్గర వెలిగించిన కొవ్వెత్తినైనా, దీపాన్ని అయినా నోటితో ఆర్పడం వల్ల జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి. ఈ విధంగా ఎప్పుడు ఊదకూడదు.
ప్రతికూల ప్రభావం
ఇంట్లో వెలిగించిన దీపానికి ఎంతో బలమైన శక్తి ఉంటుంది. ఆ జ్వాల శరీరం ఇంట్లోనే దుష్టశక్తులను తరిమికొట్టగలవు. అలాంటి దీపాలను నోటితో గాలి ఊది ఆపివేయడం వల్ల సానుకూల ప్రభావాలు తొలగిపోయి… చెడు ప్రభావం ఇంట్లో చూపించడం మొదలవుతుంది.
మీకు అంతగా దీపం ఆర్పాలి అనిపిస్తే ఆ వత్తిని పట్టుకొని తిరిగి అదే నూనెలో ముంచి ఆర్పేయాలి. అంతేతప్ప నోటితో ఊది ఆర్పడం మాత్రం ఏం మాత్రం మంచి పద్ధతి కాదు. ముఖ్యంగా సనాతన ధర్మాన్ని పాటించేవారు వాస్తు శాస్త్రాన్ని నమ్మేవారు దీపాలను నోటితో ఆర్పకూడదు.
ఇంట్లో దీపాన్ని వెలిగించడం వల్ల జీవితంలో, మీ కుటుంబంలో ఉన్న సమస్యలు కష్టాలు తొలగిపోతాయని చెబుతారు. అమ్మవారి విగ్రహం ముందు వెలిగించిన దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. నెయ్యి, ఆవనూనె, నువ్వుల నూనెతో వెలిగించిన దీపం ఎంతో మంచి ఫలితాలను ఇస్తుంది.
చాలామంది దీపాన్ని నేలపై నేరుగా ప్రమిదతో పాటూ పెడతారు. అలా నేలపై పెట్టడం మంచిది కాదు. ప్రమిద కింద అరటి ఆకును గాని తమలపాకును గాని, ఏదైనా పళ్లెం గాని లేదా నీటితో శుభ్రం చేసి ముగ్గు వేసి దీపాన్ని పెట్టాలి. నేలను తాకినట్లు పూజా వస్తువులు ఏవి ఉంచకూడదు.
ఈ నూనెతో వెలిగించాలి?
దీపాన్ని వెలిగించేందుకు ఆవు నెయ్యిని లేదా నల్ల నువ్వుల నూనెను వాడితే ఎంతో మంచిది. కానీ గేదే పాల నుంచి తీసిన నెయ్యితో మాత్రం దీపారాధన చేయకూడదు. దీపాన్ని ఎప్పుడూ తూర్పు దిక్కుగా పెట్టాలి.. లేదా ఉత్తరం దిక్కున పెట్టవచ్చు. కానీ మిగతా దిక్కుల వైపు ఉంచరాదు. ఒకవేళ మీరు మూడు ఒత్తులను వెలిగించాలనుకుంటే ఆ మూడు వత్తులు అందులో తూర్పు, పడమర, ఉత్తర దిక్కుగా పెట్టి వెలిగించుకోవాలి. ఒకవేళ మీరు ఐదుగురు వత్తులను వెలిగించాలనుకుంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణతో పాటు ఈ ఈశాన్యం వైపుగా పెట్టి భక్తులను వెలిగించాలి.
దీపం వెలిగించినప్పుడు మనసులో ఈ శ్లోకాన్ని చదువుకోవాలి.
దీపం జ్యోతి పరంబ్రహ్మ
దీపం సర్వతమోపహం
దీపేన సాధ్యతే సర్వం
సంధ్యాదీపం నమోస్తుతే!