OG Ceeded Rights: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)హీరోగా నటిస్తున్న చిత్రాలలో ‘ఓజి'(Og)ఒకటి.గ్యాంగ్ స్టార్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఓజి కి సాహూ ఫేమ్ ‘సుజిత్’ (Sujeeth)దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ పనులు కూడా పూర్తి అయ్యాయని తెలుస్తోంది. ఇటీవల పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొని తనకు సంబంధించిన సన్నివేశాలు అన్నింటిని పూర్తి చేయటంతో ఈ సినిమా షూటింగ్ పనులు కూడా ముగిసాయని తెలుస్తోంది.
గ్యాంగ్ స్టార్ యాక్షన్ థ్రిల్లర్…
ఇకపోతే ఈ సినిమా ఒక గ్యాంగ్ స్టార్ యాక్షన్ త్రిల్లర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఒక గ్లింప్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.. ఇక ఈ సినిమాకు పెద్ద ఎత్తున మార్కెట్ కూడా జరుగుతుందని తెలుస్తోంది. కేవలం దక్షిణాది రాష్ట్రాలలో కాకుండా ఉత్తరాది రాష్ట్రాలలో కూడా ఈ సినిమాకు మంచి డిమాండ్ ఉందని తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇంకా అధికారిక ప్రకటన మాత్రం తెలియచేయలేదు.
హరిహర వీరమల్లు రానేలేదు…
ఇక ఈ సినిమా ఈ ఏడాదిలోని విడుదల కాబోతుందన్న నేపథ్యంలో ఈ సినిమా హక్కుల కోసం పెద్ద ఎత్తున డిమాండ్ ఉందని తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో నటించిన హరిహర వీరమల్లు(Harihara Veeramallu) సినిమా బిజినెస్ ఇంకా పూర్తి కాలేదు అదేవిధంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు కూడా రాలేదు. ఇలా ఈ సినిమా విడుదల కాకుండానే తదుపరి ఓజీ సినిమాపై ఈ స్థాయిలో అంచనాలు, డిమాండ్ ఉండడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతలా ఎదురుచూస్తున్నారో స్పష్టమవుతుంది. ఈ సినిమా సీడెడ్ హక్కులను (Ceeded Rights)ప్రముఖ ప్రొడ్యూసర్ నాగ వంశీ కైవసం చేసుకున్నారని తెలుస్తోంది.
సీడెడ్ హక్కులు కొన్న నాగ వంశీ…
నిజానికి నాగ వంశీ(Nagavamshi) పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు సినిమా సీడెడ్ హక్కులను కొనుగోలు చేయాలని భావించారు. అయితే ఈ సినిమా హక్కులు భారీ ధర పలకడంతో ఈయన వెనుకడుగు వేశారు కానీ ఓజి సినిమా సీడెడ్(రాయలసీమ జిల్లాలు) హక్కులను మాత్రం 24 కోట్లకు దక్కించుకున్నారని తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ నాగ వంశీ మధ్య ఎంతో మంచి అనుబంధం ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇక పవన్ రాజకీయాలలో నాగ వంశి కూడా ఎంతో కీలక పాత్ర పోషించారు. ఇక ఓజి సినిమా విషయానికి వస్తే… ఈ సినిమాలో ప్రియాంక మోహన్(Priyanka MOhan)హీరోయిన్ కాగా, ఇమ్రాన్ హష్మీ ప్రతి నాయకుడుగా చేస్తున్నాడు. ఇక శ్రీయ రెడ్డి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ వంటి తదితరులు కీలకపాత్రలలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాకు తమ సంగీతం అందిస్తున్నారు.
Also Read: Vishwambhara Item Song : ఆస్కార్ విజేతనే పక్కన పెట్టేశారు… చిరు స్టెప్ వెనక ఆంతర్యం ఏంటో ?