Sonu Nigam : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ 2025 సీజన్లో టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. దాదాపు 18 సంవత్సరాల తర్వాత ఆర్సిబి జట్టు ట్రోఫీని గెలుచుకుంది. అయితే ఈ ట్రోఫీ గెలిచిన సమయంలో ఆర్సిబి కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ స్టేడియంలో కన్నీటి పర్వంతమయ్యాడు. అతని చూసిన అభిమానులు సైతం కంటతడి పెట్టడం విశేషం. ఆ తర్వాత ఆర్ సి బి ఆటగాళ్లు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ట్రోఫీ గెలిచిన మరుసటిరోజే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఇప్పటికే మూడుసార్లు ఫైనల్ కు చేరుకొని టైటిల్ గెలవకపోవడం.. ఈసారి ఫైనల్ లో టైటిల్ గెలవడంతో అభిమానుల్లో ఆ ఉత్సాహము రెట్టింపు అయింది.
Also Read : Siddharth Kaul: టీమిండియాలో ఛాన్సులు రాక… బ్యాంకులో ఉద్యోగం చేసుకుంటున్న SRH ప్లేయర్
దీంతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన విజయోత్సవ సంబరాలకు ఆర్ సి బి అభిమానులు భారీగా చేరుకున్నారు. దీంతో అక్కడ తొక్కి సలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో దాదాపు 11 మందికి పైగా మరణించారు. ఆర్సీబీ యాజమాన్యం మరణించిన వారికి ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఆర్సీబీ పై పలువురు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ప్రముఖ గాయకుడు సోను నిగమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ గెలవడంతోనే భారత్ లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం అతను చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరికొందరూ మాత్రం ఆర్సీబీ టైటిల్ గెలవడానికి.. ప్రమాదాలకు ఏమైనా సంబంధం ఉందా..? కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కి దాదాపు 18 సంవత్సరాల నుంచి ఆడుతున్నటువంటి ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ. టైటిల్ గెలవగానే అతనికే అందరూ షేక్ హ్యాండ్ ఇవ్వడం.. టైటిల్ గెలవగానే సంబురాలు చేసుకోవడం.. కోహ్లీ కంట తడి పెట్టడం చూసిన అభిమానులకు సైతం కన్నీళ్లు వచ్చాయి. అంటే ఆర్సీబీ టైటిల్ కోసం ఎంత ఆతృతగా ఎదురుచూసిందో అర్థం చేసుకోవచ్చు. కానీ అభిమానులు టైటిల్ వచ్చిన తరువాత సంబురాలు కూడా జరుపుకునేందుకు అంతే ఉత్సాహం చూపించడం గమనార్హం.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించడం.. ఆర్సీబీ ట్రోఫీ గెలుపు సంబరాన్ని విషాదంలోకి నెట్టింది. ఈ ఘటనకు సంబంధించి పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. నగర పోలీస్ కమిషనర్ తో పాటు పలువురు పోలీసులు అధికారులను సస్పెండ్ చేశారు. ఆర్సీబీ, కేఎస్సీసీఏలపై FIR నమోదు చేయగా.. విరాట్ కోహ్లీ పై కేసు నమోదు అయింది. ఇక ఆ తరువాత ఆర్సీబీ ఫ్రాంచైజీని అమ్మేస్తారని.. బ్యాన్ చేస్తారని రూమర్స్ వినిపించాయి. దీనిపై ఫ్రాంచైజీ ఓ క్లారిటీ ఇచ్చింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ అమ్మేది లేదని తేల్చి చెప్పింది. మరోవైపు 19వ సీజన్ కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఎవ్వరూ ఉంటారనే వార్త హల్ చల్ చేస్తోంది. ఈ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అద్భుతంగా ఉండటం వల్లనే ఛాంపియన్ గా నిలిచింది ఆర్సీబీ.
Jabse RCB IPL jeeti hai tabse duniya mein kuch bhi achcha nahi ho raha hai!
— Sonu Nigam (@SonuNigamSingh) June 16, 2025