BigTV English

Dharma Sandehalu:గొడుగులు, చెప్పులు వాడకంలోకి ఎలా వచ్చాయో తెలుసా?

Dharma Sandehalu:గొడుగులు, చెప్పులు వాడకంలోకి ఎలా వచ్చాయో తెలుసా?

Dharma Sandehalu:వేసవికాలం కావడంతో ఎండ భగభగా మండిపోతోంది. తన ఆశ్రమం నుండి ఓ పనిమీద బయలుదేరిన జమదగ్ని మహామునిని ఎండ చుర్రున తాకింది. అయినప్పటికీ పట్టించుకోకుండా తన పనిమీద తాను వెళ్లడం మొదలుపెట్టాడు. చూస్తుండగానే ఎండ తీవ్రత ఇంకా పెరిగింది. జమదగ్ని మహాముని ఎండ తీవ్రంగా నిలువ నీయలేదు. దీంతో ఆగ్రహించిన ముహాముని సూర్యుడ్ని దూరంగా వెళ్లమని ఆదేశిస్తాడు.


అంతా విన్న సూర్యుడు జమదగ్ని మాటలు పట్టించుకోలేదు. మరింత ఉగ్రరూపం దాల్చాడు. ఎండ వేడి ఇంకా ఎక్కువ కావడంతో భరించలేకపోయిన జమదగ్ని…. వెంటనే తన విల్లూ, బాణం ఎక్కుపెట్టి సూర్యుడిపై బాణాలు వదలటం ప్రారంభించాడు. అయితే అవి సూర్యుణ్ణి తాకకుండానే నేలమీద పడిపోతుంటాయి.అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా… జమదగ్ని మహాముని పట్టువిడవకుండా ఒక బాణానికి మరో బాణం గుచ్చుతూ ఇంకా పైపైకి సంధించటం మొదలుపెట్టాడు. దీంతో సూర్యుడికి కూడా కోపం పెరిగిపోయి మరింత మొండిగా వేడి ఇంకా పెంచాడు.

అప్పుడే ఆశ్రమం నుంచి బయటకు వచ్చి ఈ తతంగాన్నంతా చూసిన జమదగ్ని శిష్యురాలు ఎండ వేడిని తట్టుకోలేక స్పృహతప్పి పడిపోతుంది. దీంతో ఆమెను తీసుకెళ్లి ఆశ్రమంలో పడుకోబెట్టిన జమదగ్ని మరింత కోపంతో…. తన అస్త్రాలన్నింటినీ తీసుకుని సూర్యుడిపై సంధించసాగాడు.ఇక సూర్యుడికి వాటిని తట్టుకోవడం కష్టమై, బాణాలు వచ్చి గుచ్చుకుంటుంటే విలవిలలాడిపోతూ…. ఇక లాభం లేదనుకుంటూ ఒక మనిషిరూపం దాల్చి జమదగ్ని ముందు ప్రత్యక్షమయ్యాడు.


ఓ మహామునీ..! ఏంటి తమరు చేస్తున్న పని. సూర్యుడు అంత దూరంలో ఉన్నాడు. అతడిని నువ్వు గాయపరచడం సాధ్యం కాదని” హెచ్చరించాడు. అప్పుడు జమదగ్ని మాట్లాడుతూ… “ఇప్పుడు సూర్యుడు నాకు దూరంగా ఉండవచ్చు కానీ… మధ్యాహ్నం సమయాన నా నడినెత్తికి చేరువవుతాడు కదా…! అప్పుడైనా నా బాణాలకు చిక్కకపోడు” అన్నాడు కసిగా…జమదగ్ని అన్నంతపనీ చేసేలాగా ఉన్నాడని గ్రహించిన సూర్యుడు తన అసలు రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఓ మహామునీ…! శాంతించు. నేను సూర్యుణ్ణి. నా ప్రకృతి ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను. నా తీక్షణతో భూమిని వేడెక్కించటం నా వృత్తి ధర్మం” అని చెప్పుకొచ్చాడు.

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×