హిందువుల అతి పెద్ద పండుగలో మహాశివరాత్రి ఒకటి. ప్రతి ఏడాది శివరాత్రి కోసం ఎదురుచూసే శివ భక్తులు ఎంతోమంది. ఏటా ఫాల్గుణ మాసం కృష్ణపక్ష చతుర్దశి తిథినాడు మహాశివరాత్రి పండుగ నిర్వహించుకుంటారు. ఈ ఏడాది మహాశివరాత్రి ఫిబ్రవరి 26నా వచ్చింది. ఆ పండుగ రోజు ఉదయం నుంచి రాత్రి దాకా శివుడిని పూజిస్తారు. రాత్రంతా జాగారం ఉంటారు. ఉపవాసం చేస్తారు. తమ కోరికలను తీర్చమని ఆ శివుడిని ప్రార్థిస్తారు.
శివ భక్తులు మహాశివరాత్రికి రాత్రంతా మేల్కొని పార్వతీ దేవిని శివుడిని పూజిస్తారు. మహాశివరాత్రి రోజు శివుడు పార్వతి దేవిని వివాహం చేసుకున్నారని చెబుతారు. ఈ మహాశివరాత్రి రోజున శివుడు లింగం రూపంలో కనిపించాడని కూడా నమ్ముతారు.
శివరాత్రి అంటే శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి అతని ఆశీర్వాదాన్ని పొందడానికి కేటాయించిన రోజు. ఆరోజు శివుడికి కోపం తెప్పించే ఏ పనులు చేయకూడదు. శివారాధన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇత్తడి లోహం
మహాశివరాత్రి రోజున శివునికి అభిషేకం చేసేటప్పుడు లేదా పాలు, నీరు సమర్పించేటప్పుడు కాంస్య పాత్రను వాడకూడదు అంటే ఇత్తడి పాత్రను వినియోగించకూడదు. ఇలా చేయడం చాలా అశుభం. బంగారం, వెండి రాగితో చేసిన పాత్రలతో మాత్రమే శివునికి అభిషేకం చేయాలి.
నల్లని దుస్తులు వద్దు
మహాశివరాత్రి రోజున నల్లని దుస్తులు ధరించకండి. పూజ చేసేటప్పుడు నలుపు దుస్తులు ధరిస్తే శివునికి విపరీతమైన కోపం వస్తుంది. అలాగే మహాశివరాత్రి రోజున పొరపాటున కూడా మాంసం, మద్యం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహారాలు తినకూడదు. అవి తామస ఆహారాలుగా చెప్పుకుంటారు. అంటే శరీరంలో వేడిని ఉత్పత్తి చేసే ఆహారాలు వాటిని తినడం మంచిది కాదు. శివుని ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంటుంది.
తులసి ఆకులు వద్దు
శివలింగంపై తులసి, కమలం వంటి పువ్వులు, పత్రాలు పెట్టడం పూర్తిగా నిషిద్ధం. వాటిని పూజలో ఉపయోగించకూడదు. శివలింగానికి విరిగిన లేదా ముక్కలైన బియ్యాన్ని, ఆ బియ్యంతో వండిన ఆహారాన్ని కూడా సమర్పించకూడదు. చాలామంది ఈ విషయం తెలియక శివలింగానికి తులసిని సమర్పిస్తూ ఉంటారు. కమల పువ్వులతో పూజలు చేస్తారు. శివునికి ఈ రెండింటితో పూజ చేయడం ఏమాత్రం ఇష్టం ఉండదు.
Also Read: మహాశివరాత్రి నాడు పొరపాటున కూడా వీటిని కొనకండి
మహాశివరాత్రి రోజున మీ మనసులోకి చెడు ఆలోచనలను రాకుండా చూసుకోండి. ఎవరితోనూ చెడు మాటలు మాట్లాడకండి. మీ మనసును పూర్తిగా శివుడిపైనే కేంద్రీకరించండి. అతనిని ధ్యానించండి, పూజించండి. మీరు కోరిన కోరికలు నెరవేరుస్తాడు. ఆ శివదేవుడు శివరాత్రి ఉపవాస సమయంలో ధాన్యాలతో చేసిన ఆహారాలు తినొద్దు. అంటే బియ్యము, ఓట్స్, క్వినోవా, గోధుమలు, బార్లీ వంటి వాటితో చేసినవై తినకూడదు. ఆరోజు ఉపవాసంలో పండ్లు మాత్రమే తినాలి. ఇక్కడ చెప్పినట్టు శివునికి నచ్చిన విధంగా పూజలు చేస్తే అతని అనుగ్రహం పొందవచ్చు. శివునికి ఇష్టం లేని ఈ పనులను ఆ రోజంతా చేయడం మానేయండి. మీపై మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి.