BigTV English
Advertisement

NZ vs BAN: రెచ్చిపోయిన రచిన్ రవీంద్ర.. పాక్, బంగ్లా ఇక ఇంటికే ?

NZ vs BAN: రెచ్చిపోయిన రచిన్ రవీంద్ర.. పాక్, బంగ్లా ఇక ఇంటికే ?

NZ vs BAN:  చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… పాకిస్తాన్ లోని రావల్పిండి వేదికగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. అయితే అనూహ్యంగా… బంగ్లాదేశ్ ను చిత్తు చేసిన న్యూజిలాండ్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో టీమిండియాతో పాటు న్యూజిలాండ్ కూడా సెమిస్ బెర్త్ ను ఖరారు చేసుకున్నట్లఅయింది. అధికారికంగా సెమిస్ కు వెళ్ళినప్పటికీ… ప్రస్తుత పాయింట్స్ టేబుల్ ప్రకారం టీమిండియా అలాగే న్యూజిలాండ్ రెండు సెమి ఫైనల్ కు వెళ్తాయి.


Also Read: Pakistan on Virat Kohli: కోహ్లీ సెంచరీ చేయకుండా పాకిస్థాన్‌ కుట్రలు ?

ఇవాల్టి మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు పైన ఏకంగా ఐదు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది న్యూజిలాండ్. న్యూజిలాండ్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర ( Rachin Ravindra ) అద్భుతమైన సెంచరీ తో… బంగ్లాదేశ్ టీమ్ కు చుక్కలు చూపించాడు. 105 బంతుల్లోనే 112 పరుగులు చేసి న్యూజిలాండ్ ను విజయతీరాలకు చేర్చాడు రవీంద్ర. న్యూజిలాండ్ ఆటగాడు రవీంద్ర కు తోడుగా వికెట్ కీపర్ టామ్ లాతం కూడా 55 పరుగులతో రాణించాడు. ఈ తరుణంలోనే… ఐదు వికెట్ల తేడాతో న్యూజిలాండ్… గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇక అంతకుముందు బంగ్లాదేశ్ టీం నిర్ణీత 50 ఓవర్లలో… 9 వికెట్లు నష్టపోయి 236 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఆ 236 పరుగులు చేయడానికి కూడా చాలా కష్టపడింది బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ కెప్టెన్ శాంటో 77 పరుగులు చేయగా… జకీర్ అలీ 45 పరుగులు చేసి జట్టుకు… గౌరవప్రదమైన స్కోర్ అందించారు. ఇక బంగ్లాదేశ్ ఇచ్చిన లక్ష్యాన్ని 46.1 ఓవర్స్ లోనే   ఐదు వికెట్లు నష్టపోయి విజయం సాధించింది న్యూజిలాండ్.


 

అయితే… బంగ్లాదేశ్ టీం ను ఐదు వికెట్ల తేడాతో ఓడించిన న్యూజిలాండ్… ఛాంపియన్స్ ట్రోఫీలో సేఫ్ జోన్ లోకి వెళ్ళింది. గ్రూప్ ఏ లో నాలుగు జట్లు ఉండగా… అందులో న్యూజిలాండ్ అలాగే టీమిండియా మాత్రమే… సెమిస్ వెళ్లేలా… తమ దారులను సుగమం చేసుకున్నాయి. ఈ రెండు జట్లు ఆడిన రెండు మ్యాచ్ లలో విజయం సాధించాయి. దీంతో… న్యూజిలాండ్ అలాగే టీమిండియా చెరో నాలుగు పాయింట్లు సంపాదించాయి. ఇవాళ బంగ్లాదేశ్ పైన గెలిచిన న్యూజిలాండ్ టీం… గ్రూప్ ఏ లో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. టీమిండియా రన్ రేట్ న్యూజిలాండ్ కంటే చాలా తక్కువగా ఉంది.

Also Read: Pak Fan In India Jersey: పాక్ ఓడిపోతుందని..జెర్సీ మార్చేసిన ఫ్యాన్..వీడియో వైరల్ !

అందుకే పాయింట్స్ టేబుల్ లో న్యూజిలాండ్ మొదటి స్థానానికి వెళ్లగా… రెండవ స్థానంలో టీమిండియా నిలిచింది. ఈ రెండు జట్లు… మరో మ్యాచ్ లో ఆడబోతున్నాయి. ఇందులో ఎవరు గెలిచినా… ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఇప్పటికే చెరో నాలుగు పాయింట్లు సంపాదించారు కనుక… న్యూజిలాండ్ అలాగే టీమిండియా నేరుగా సెమి ఫైనల్ కి వెళ్తాయి. అటు గ్రూప్ బి లో… ఆస్ట్రేలియా అలాగే సౌత్ ఆఫ్రికా.. రెండు జట్లు సెమీఫైనల్ కు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

 

Related News

IND VS AUS 4th T20I : వాషి యో వాషి..వాష్టింగ‌న్ మ్యాజిక్‌..టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ

Kajal Aggarwal: టీమిండియా మ్యాచ్ కు కాజ‌ల్‌..భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుని మ‌రీ, ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

Tata Motors: వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్ల‌కు టాటా బంప‌ర్ ఆఫ‌ర్‌

PV Sindhu: బోల్డ్ అందాలతో రెచ్చిపోయిన PV సింధు.. వెకేషన్ లో భర్తతో రొమాన్స్

IND VS AUS, 4th T20I: టాస్ ఓడిన టీమిండియా..మ్యాక్స్‌వెల్ తో పాటు 4 గురు కొత్త‌ ప్లేయ‌ర్లు వ‌చ్చేస్తున్నారు

Harleen Deol: మోడీ సార్‌.. ఎందుకు ఇంత హ్యాండ్స‌మ్ గా ఉంటారు? హర్లీన్ డియోల్ ఫ‌న్నీ క్వ‌శ్చ‌న్‌

Pratika Rawal : ప్రతికా రావల్ ను అవమానించిన ఐసీసీ.. కానీ అమన్ జోత్ చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే

Nigar Sultana: డ్రెస్సింగ్ రూంలో జూనియర్లపై దాడి… బంగ్లా ఉమెన్ టీమ్ కెప్టెన్‌పై ఆరోపణలు

Big Stories

×