Junior Court Assistant Jobs: నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు మంచి అవకాశం. సుప్రీంకోర్టులో పలు ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమై 20 రోజులు అవుతోంది. ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
సుప్రీంకోర్టులో జూనియర్ కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలకు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసారి నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.
ALSO READ: RRB Recruitment: గుడ్ న్యూస్.. రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. మరోసారి దరఖాస్తు గడువు పొడిగింపు..
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 241
ఇందులో జూనియర్ కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేది: 2025 ఫిబ్రవరి 5 (నేటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది)
దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు 2025 మార్చి 8 లోగా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల వయస్సు మించరాదు. (2025 మార్చి 8 నాటికి 30 ఏళ్ల వయస్సు మించరాదు)కొంతమంది అభ్యర్థులకు వయస్సు సడలింపు ఉంటుంది.
విద్యార్హత: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉండాలి. ఇంగ్లిష్ టైపింగ్ వచ్చి ఉండాలి. 35 wpm స్పీడుతో టైపింగ్ వచ్చి ఉంటే సరిపోతుంది. కంప్యూటర్ ఆపరేషన్ పై కొంచె నాలెడ్జ్ ఉండాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1000 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, దివ్యాంగ అభ్యర్థులు రూ.250 ఉంటుంది.
వేతనం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు రూ.35,400 నుంచి రూ.72,040 వరకు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు. అబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు, కంప్యూటర్ నాలెడ్జ్, టైపింగ్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్ ద్వారా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
అబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్‌లో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 50 మార్కులు జనరల్ ఇంగ్లిష్, 25 మార్కులు జనరల్ అప్టిట్యూడ్, 25 మార్కులు జనరల్ నాలెడ్జ్ నుంచి అడుగుతారు. 100 ప్రశ్నలకు గానూ 2 గంటల సమయం ఇస్తారు.
కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి.
10 సమయంతో టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. 35 వర్డ్ పర్ మినిట్ స్పీడుతో టైపింగ్ చేయాల్సి ఉంటుంది.
2 గంటల సమయంతో డిస్ట్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో కాంప్రహెన్సివ్ ప్యాసేజ్, వ్యాస రచన ఉంటుంది. ఈ నాలుగు పరీక్షల్లో పాసైన వారిని ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.sci.gov.in/
అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన వారు అందరూ ఈ ఉద్యోగాలకు అర్హతవుతారు. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా కల్పిస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
ALSO READ: DCIL Recruitment: డిగ్రీ అర్హతతో సొంత రాష్ట్రంలో ఉద్యోగం భయ్యా.. మిస్ అవ్వకండి.. రేపే లాస్ట్ డేట్
ముఖ్యమైనవి:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 241
దరఖాస్తుకు చివరి తేది: 2025 మార్చి 8 (దరఖాస్తుకు 11 రోజుల సమయం మాత్రమే ఉంది.)