BigTV English

Maha Shivratri 2025: మహాశివరాత్రి నాడు పొరపాటున కూడా వీటిని కొనకండి

Maha Shivratri 2025: మహాశివరాత్రి నాడు పొరపాటున కూడా వీటిని కొనకండి

మహాశివరాత్రిని పవిత్రంగా నిర్వహించుకోవాలి. సనాతన ధర్మంలో మహాశివరాత్రి ఉపవాసం ఎంతో ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఈ రోజున శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి పర్వదినం రోజే దేవతల ప్రభువైన మహాదేవుడికి ఆ విశ్వమాత పార్వతీదేవికి వివాహం జరిగిందని చెప్పుకుంటారు. అందుకే దీన్ని శుభరాత్రిగా చెబుతారు. ఆ రోజు ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేస్తారు. జ్యోతిష్యులు, వేద పండితులు చెబుతున్న ప్రకారం మహాశివరాత్రి రోజు కొన్ని రకాల వస్తువులను కొనడం అశుభం. ఆ వస్తువులు ఏంటో తెలుసుకోండి.


తోలు వస్తువులు
మహా శివరాత్రి రోజున లెదర్‌తో చేసిన వస్తువులు ఏవీ కొనకూడదు. వాటిని కొంటే ఇంట్లో ప్రతికూల శక్తి వస్తుందని చెబుతారు. అలాగే ఆరోజు మీరు చేసిన ప్రార్థనలు, పూజలు కూడా మంచి ఫలితాలను ఇవ్వవని నమ్ముతారు. కాబట్టి శివరాత్రి రోజున ఎట్టి పరిస్థితుల్లో లెదర్ తో చేసిన ఏ వస్తువును కొనకండి. లెదర్ తో చేసినవి ఎక్కువగా హ్యాండ్ బ్యాగులు, పర్సులు, చెప్పులు వంటివి ఉంటాయి. కాబట్టి వాటిని కొనకుండా ఉండేందుకు ప్రయత్నించండి.

మద్యం
ప్రతిరోజూ మద్యం తాగే వారు ఎంతోమంది. కొంతమందికి ప్రతి రాత్రి మద్యం తాగకపోతే నిద్ర కూడా పట్టదు. కానీ మహాశివరాత్రి రోజున మాత్రం మద్యం తాగకూడదు. మీరు ఉదయం పూట ఆ శివుడిని పూజించి రాత్రి అయ్యేసరికి మద్యం తాగితే ఆ ఫలితం కూడా మీకు దక్కదు. కాబట్టి మీరు చేసిన పూజలు మంచి ఫలితాలను ఇవ్వాలంటే ఆ ఒక్కరోజు మద్యానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి.


పదునైన వస్తువులు
మహాశివరాత్రి అనేది శుభ సందర్భం. ఆ రోజున పదునుగా ఉండే కత్తి, కత్తెర, సూది వంటివి కొనడం అశుభంగా చెప్పుకుంటారు. ఇలాంటి వస్తువులను కొనుగోలు చేయడం వల్ల ఆ రోజు శివ పూజలో కలిగిన పుణ్యం కూడా తొలగిపోతుందని అంటారు. కాబట్టి ఆ ఒక్కరోజు ఇవేవీ కొనకుండా జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నించండి. అంతగా అవసరమైతే పనులను వాయిదా వేసుకోండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ పదునైన వస్తువులను కొనేందుకు ప్రయత్నించకండి.

విరిగిన వస్తువులు
మహాశివరాత్రి రోజున ఇంట్లో విరిగిన వస్తువులు ఉండకుండా చూసుకోండి. విరిగిన వస్తువులు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవేశిస్తుందని చెబుతారు. కాబట్టి శివరాత్రి రోజు ఇంట్లో విరిగిన వస్తువులను వాడడం కానీ ఉంచడం కానీ చేయకండి. అలాగే బయట తక్కువ ధరకే విరిగిన వస్తువులు వస్తే తెచ్చుకోవడం కూడా చేయవద్దు. ఇది ఏమాత్రం మంచిది కాదు.

మహాశివరాత్రి రోజు పూజ ఎప్పుడు చేయాలి?
పంచాంగం ప్రకారం మహాశివరాత్రి ఫిబ్రవరి26 బుధవారం వచ్చింది. ఈరోజున భద్ర కాలం ఉదయం 11:08 నుండి రాత్రి 10:05 వరకు ఉంటుంది. కానీ గ్రంథాలు చెబుతున్న ప్రకారం శివుడు మహాకాలుడు. అంటే అన్ని కాలాలకు అతనే అధిపతి. కాబట్టి భద్రుడు అతని ఆరాధనపై ఎటువంటి ప్రభావం చూపలేడు. కాబట్టి మహాశివరాత్రి రోజు ఎప్పుడు మహా శివుడుని పూజించినా కూడా అంతా మంచే జరుగుతుంది.

Also Read: చాణక్యుడు చెప్పినట్లు ఈ పనులు చేస్తే.. డబ్బులకు కొరతే ఉండదు

Related News

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Big Stories

×