BigTV English

Bhishma Ekadashi:భీష్మ ఏకదశి వ్రతం ఇలా చేయండి

Bhishma Ekadashi:భీష్మ ఏకదశి వ్రతం ఇలా చేయండి

Bhishma Ekadashi:మాఘ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని జయ ఏకాదశి అంటారు. ఈ రోజున విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల ప్రతికూల శక్తుల ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు. అంతేకాదు ఆర్థిక పరమైన ఇబ్బందులన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. చెడు శక్తులు, పిశాచాల ప్రభావం అనేది ఎప్పటికీ ఉండదు.


ఈ రోజునే కురుకుల యోధుడు భగవంతుడిలో ఐక్యమైన రోజు. ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రమైన తిథి. భీష్ముడు పాండవులకు చేసిన మహోపదేశం విష్ణు సహస్రనామం. ఆ వేద మంత్రాన్ని శ్రీకృష్ణ భగవానుడే ఎదుటే జపించి ఈ లోకాలను వదిలి వెళ్లిన రోజు ఏకాదశి . నువ్వు సాధించినవని అన్నీ భగవంతునికే అర్పితం చేసి ఊర్ధ్వ లోకాలకు చేరుకోవాలని చెబుతున్నాయి ఉపనిషత్తులు. ఈ మాటను భీష్ముడు పాటించాడు.

దక్షిణ భారతంలో జయ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని కూడా పిలుస్తారు. 31 జనవరి 2023 మంగళవారం నాడు ఉదయం 11:55 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 1వ తేదీన బుధవారం మధ్యాహ్నం 2:01 గంటలకు ముగుస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం, సూర్యోదయం తిథిని పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి ఫిబ్రవరి 1వ తేదీన జయ ఏకాదశి వ్రతం నిర్వహించాలి.


సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేయాలి. నారాయణుడి విగ్రహాన్ని ఏదైనా పళ్లెంలో పసుపు బట్టపై ఉంచాలి. శ్రీ మహా విష్ణువును స్మరించుకుంటూ ధూపం, దీపం వెలిగించాలి. అనంతరం చందనం, పండ్లు, పసుపు రంగు పువ్వులు, నువ్వులు సమర్పించాలి. ఉపవాస వ్రతాన్ని ప్రారంభించి, ఏకాదశి కథ చదవాలి. ఉపవాసం ఉండే రాత్రి వేళలో పండ్లు తినొచ్చు. ఆ మరుసటి రోజు ద్వాదశి రోజున స్నానం చేసి.. పేదలకు ఏదైనా ఆహారం దానం చేసిన అనంతరం ఉపవాస వ్రతాన్ని విరమించాలి. భీష్మ ఏకాదశి వ్రతాన్ని పాటించడం వల్ల సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది.మరణం తర్వాత మోక్షం లభిస్తుందని పండితులు చెబుతారు

Related News

Ganesh Chaturthi: గణపతి చేతిలో లడ్డూ ఎందుకు పెడతారు? గణేష్ లడ్డూ విశిష్టత ఏమిటి..

Vinayaka Chavithi 2025: గణపయ్యకు ఇష్టమైన ప్రసాదం ఇదే.. ఈ నియమాలు తప్పక పాటించండి!

Tirumala Darshan: వరుస సెలవులు.. భక్తులతో సందడిగా మారిన తిరుమల

Shri Krishna Janmashtami: దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు.. కిటకిటలాడుతున్న దేవాలయాలు..

Garuda Puranam: ఆ పనులు చేస్తే మనిషి ఆయుష్షు తగ్గిపోతుందట – అసలు గరుడపురాణం ఏం  చెప్తుందంటే..?

Hinduism – Science: సైన్స్ ను సవాలు చేసిన హిందుత్వం –  అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు

Big Stories

×