E-Paper
Advertisement

Shikhamani: తిరుమల శ్రీవారికి అలంకరించే శిఖామణి గురించి తెలుసా..? ఇంకా ఏమేం అలంకరిస్తారంటే

Shikhamani: తిరుమల శ్రీవారికి అలంకరించే శిఖామణి గురించి తెలుసా..? ఇంకా ఏమేం అలంకరిస్తారంటే
Advertisement

Shikhamani: తిరుమల శ్రీవారికి ప్రతిరోజూ అలంకారం ఎలా చేస్తారో తెలుసా..? ఆ శ్రీనివాసుని అలంకరణలో అత్యంత పవిత్రమైన అలంకరణ ఏదో తెలుసా..? ఇక అన్నింటికన్నా ముఖ్యమైన గురువారం రోజు జరిగే అలంకరణ గురించి మీకు తెలుసా..? అసలు స్వామి వారికి ఏన్ని రకాల మాలలతో, పుష్పాలతో  అలంకరణ చేస్తారో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

కలియుగ వైకుంఠం తిరుమలలో వెలిసిన భక్త వల్లబుడు శ్రీ వెంకటేశ్వరస్వామి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. తిరుమల కొండ మీద ప్రతిరోజు నిత్యకళ్యాణం పచ్చతోరణం అన్న రీతిలో ఉంటుంది. అలాంటి శ్రీవారికి  ప్రతి రోజూ వివిధ రకాల అలంకారాలు జరుగుతుంటాయి. పుష్పాలంకార ప్రియుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి నిర్వహించే అనేక సేవలలో పుష్పకైంకర్యం అత్యంత ప్రియమైనదట. పవిత్రమైన తిరువాయ్‌ మొళి అనే ప్రాచీన తమిళ గ్రంథంలో కూడ స్వామి వారు అలంకార ప్రియుడని ఉందట.  స్వామివారి ఆపాదమస్తకం వివిధ రకాల సుగంధ భరిత కుసుమాలతో సర్వాంగ సుందరంగా అలంకరించే పుష్పాల గురించి మాలల గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Advertisement

సాలిగ్రామ మాల: శ్రీవారి భుజాల నుండి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతూ ఉన్న సాలగ్రామాల మాలలకు ఆనుకొని వేలాడదీస్తూ అలంకరింపబడే పొడవైన పూలమాలలు. ఇవి రెండుమాలలు. ఒక్కొక్కటి సుమారు 4 మూరలు ఉంటాయట.

కంఠసరి: రెండు భజాలమీదికి అలంకరింపబడే దండ ఇది ఈ మాల ఒకటి మూడున్నర మూరలు ఉంటుందట..

Advertisement

వక్షస్థల లక్ష్మి: శ్రీవారి వక్షఃస్థలంలో ఉన్న శ్రీదేవి, భూదేవిలకు రెండు దండలు ఉంటాయట. ఈ రెండు దండలు ఒక్కొక్కటి ఒకటిన్నర మూర ఉంటుందట.

శంఖు చక్రం: శంఖు చక్రాలకు రెండు దండలు అలంకరిస్తారు. ఈ రెండు దండలు ఒక్కొక్కటి ఒక మూర ఉంటుదట.

కఠారి సరం: శ్రీస్వామివారి బొడ్డు దగ్గర నందక ఖడ్గానికి అలంకరించే దండ ఇది రెండు మూరలు ఉంటుందట.

తావళములు: రెండు మోచేతుల కింద, నడుము నుండి మోకాళ్ళపై హారాలుగా, మోకాళ్ళ నుండి పాదాల వరకు జీరాడుతూ వ్రేలాడదీసేవి మూడు  దండలు. ఇందులో ఒకటి మూడు మూరలు ఉంటుందట. రెండోది మూడున్నర మూరలు ఉంటుందట. మూడోది నాలుగు మూరలు ఉంటుందట.

తిరువడి దండలు: శ్రీస్వామి వారి పాదాలపై చుట్టూ అలంకరించే రెండు దండలు. ఇవి ఒక్కొక్కటి ఒక్క మూర ఉంటాయట.

శిఖామణి: కిరీటం మీదనుంచి రెండు భుజాలమీది వరకు అలంకరింపబడే ఒకే ఒక దండను ‘శిఖామణి’ అంటారు. ఇది ఎనిమిది మూరల దండ

అలాగే ప్రతి గురువారం జరిగే ”పూలంగి సేవ”లో మాత్రమే శ్రీస్వామి వారి మూలమూర్తికి ఆభరణాలన్నీ తీసివేసి, పై పేర్కొన్న మాలలతో పాటు నిలువెత్తు స్వామివారిని విశేషంగా పూలమాలలతో అలంకరిస్తారట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: వాస్తు దోషాలతో కష్టాలు పడుతున్నారా..?  ఈ చిన్న రెమెడీస్ వాస్తును సెట్ చేస్తాయట

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×