BigTV English

Types of rains: వానలు ఎన్ని రకాలంటే…!

Types of rains: వానలు ఎన్ని రకాలంటే…!
Types of rains

Types of rains: భూమ్మీది జలవనరులు.. సూర్యుడి వేడిమి కారణంగా ఆవిరిగా మారి, మేఘాలుగా స్థిరపడి.. వాతావరణం అనుకూలించగానే వానరూపంలో కురుస్తాయి. అయితే.. వాన తీవ్రతను బట్టి దానికి కొన్ని ప్రత్యేకమైన పేర్లున్నాయి. మన తెలుగునేలపై పలు ప్రాంతాల్లో వాన స్వభావం, తీవ్రతను బట్టి ఒక్కోపేరున పిలుస్తారు.


గాంధారి వాన = కంటికి ఎదురుగా ఉన్నది కనిపించనంత జోరుగా కురిసే వాన
మాపుసరి వాన = సాయంత్రం కురిసే వాన
మీసర వాన = మృగశిరకార్తెలో కురిసే వాన
దుబ్బురు వాన = తుప్పర/తుంపర వాన
సానిపివాన = అలుకు(కళ్లాపి) జల్లినంత కురిసే వాన
సూరునీల్ల వాన = ఇంటి చూరు నుండి ధార పడేంత వాన
బట్టదడుపు వాన = ఒంటి మీది బట్టలు తడిసేంత వాన
తెప్పె వాన = చిన్న మేఘం నుంచి పడే వాన
సాలు వాన = ఒక నాగలిసాలుకు సరిపడా వాన
ఇరువాలు వాన = రెండుసాల్లకు & విత్తనాలకు సరిపడా వాన
మడికట్టు వాన = బురదపొలం దున్నేటంత వాన
ముంతపోత వాన = ముంతతోటి పోసినంత వాన
కుండపోత వాన = కుండతో కుమ్మరించినంత వాన
ముసురు వాన = విడువకుండా కురిసే వాన
దరోదరి వాన = ధాటిగా, ఆగకుండా కురిసే వాన
బొయ్యబొయ్యగొట్టే వాన = హోరుగాలితో కూడిన వాన
రాళ్ల వాన = వడగండ్ల వాన
కప్పదాటు వాన = అక్కడక్కక కొద్దిగా కురిసిన వాన
తప్పడతప్పడ వాన = టపటపా కొంచెంసేపు కురిసే వాన.
దొంగ వాన = రాత్రంతా కురిసి తెల్లారి కనిపించని వాన
కోపులునిండే వాన = రోడ్డు పక్కన గుంతలు నిండేంత వాన
ఏక్దార వాన = ఏకధారగా కురిసే వాన
మొదటి వాన = విత్తనాలకు బలమిచ్చే వాన
సాలేటి వాన = భూమి తడిసేంత భారీ వాన
సాలుపెట్టు వాన = దున్నేందుకు సరిపోయేంత వాన…


Related News

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Big Stories

×