BigTV English

 Pakistan Team : వరల్డ్ కప్ లో ఎనిమిదో సారి ఓడిన పాకిస్తాన్

 Pakistan Team : వరల్డ్ కప్ లో ఎనిమిదో సారి ఓడిన పాకిస్తాన్

 Pakistan Team : వరల్డ్ కప్ లో పాకిస్తాన్ మరోసారి ఇండియా చేతిలో ఓటమి పాలైంది. అహ్మదాబాద్ లో మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లోమొదట్లో ఆత్మవిశ్వాసంతో కనిపించిన పాకిస్తాన్ తర్వాత ఒక్కసారి ఒత్తిడికి గురైంది. ఒకదశలో 155 పరుగులకి 3 వికెట్లతో పటిష్టస్థితిలో ఉన్న పాక్ తర్వాత పేక మేడలా కుప్పకూలిపోయింది. కేవలం 36 పరుగులకు చివరి 6 వికెట్లు కోల్పోయింది. 191 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇండియా బ్యాటింగ్ ప్రారంభించి 30 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి లక్ష్యం చేధించింది.


వరల్డ్ కప్ ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటివరకు ఏడు సార్లు ఇండియా-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లు జరిగాయి. ప్రతిసారి పాకిస్తాన్ ఓడిపోవడం-ఇండియా గెలవడం ఆనవాయితీగా మారింది. ఒకప్పుడు అరవీర భయంకరులైన ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, మియాందాద్, అబ్దుల్ ఖాదిర్, అమీర్ సోహైల్, రమీజ్ రాజా, ఇంజమామ్ ఉల్ హక్, సలీం మాలిక్ ఇలాంటి ఎందరో ఉన్నప్పుడు కూడా ఇండియా చేతిలో పాక్ ఓడిపోయింది. 1992లో పాకిస్తాన్ వరల్డ్ కప్ గెలిచి కూడా ఇండియా చేతిలో ఓటమి పాలవడం అదొక విశేషమనే చెప్పాలి.

పాకిస్తాన్ లో కొందరేమంటారంటే…అలా ఓడిపోవడం పాకిస్తాన్ కి సెంటిమెంట్ గా కలిసి వస్తుందని, తర్వాత మ్యాచ్ ల్లో రెట్టించిన ఉత్సాహంతో ఆడుతుందని అంటుంటారు. అదే తమ జట్టుకి కలిసి వచ్చిందని కూడా చెబుతుంటారు.
అదే భారత్ లో అభిమానులు ఏమనుకుంటారంటే… వరల్డ్ కప్ పోయినా పర్వాలేదు, పాకిస్తాన్ పై గెలిచాం అదే చాలని వీరు తృప్తి  పడతారు.
ఇక భారత ఆటగాళ్లు ఏమనుకుంటారంటే… వరల్డ్ కప్ సంగతి దేవుడెరుగు…ముందు పాకిస్తాన్ ని కొడితే సగం గెలిచినట్టేననే మానసిక స్థితికి చేరిపోయారు. అందుకే వరల్డ్ కప్ లో మాత్రం చావో రేవో అన్నట్టు ఆడతారు.  ఇలా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వారు సంతృప్తి పడుతుంటారు. 


Related News

Mohamed Siraj : సేమ్ టు సేమ్ డిట్టు దించేశారు… మహమ్మద్ సిరాజ్ కూడా కుళ్ళుకోవాల్సిందే

Travis head – SRH Fan : ఆస్ట్రేలియా గడ్డపై SRH ఫ్యాన్స్ రచ్చ చూడండి.. హెడ్ ను అడ్డంగా పట్టుకొని

IPL 2026 : SRH కోసం మరోసారి రంగంలోకి రజినీకాంత్?

World cup 2027: గిల్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ.. ఇంత దారుణమా?

Yash Dayal: RCB బౌలర్ దయాల్ కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2026 నుంచి ఔట్?

Jos Butler : ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక క్రికెట్ కు గుడ్ బై ?

Big Stories

×