BigTV English

India-Pakistan Match: ఇండియా-పాక్ మ్యాచ్…150 కోట్ల మంది చూశారు !

India-Pakistan Match: ఇండియా-పాక్ మ్యాచ్…150 కోట్ల మంది చూశారు !

India-Pakistan Match: 1.50 లక్షల మందితో అహ్మదాబాద్ స్టేడియం కిటకిట
ఒక్కరోజులో రూ.150 కోట్ల ఆదాయం. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు ఒక పండుగకన్నా ఎక్కువ. దాయాదుల పోరుని ఎంతో ఉత్కంఠతో, నరాలు తెగేంత టెన్షనుతో చూస్తుంటారు.


ప్రతి బాల్, ప్రతి పరుగు కూడా టెన్షన్ టెన్షన్ గానే ఉంటుంది. బౌలర్ పరుగెత్తే దగ్గర నుంచి వేసే వరకు, బ్యాట్స్ మెన్ కొట్టేవరకు ఊపిరి బిగపట్టి చూస్తుంటారు.
అంత ఉత్కంఠభరితంగా ఉంటుందని భావించి మ్యాచ్ ని ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మంది చూశారని ఒక అంచనా…

ప్రపంచంలోనే అతిపెద్దదైన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ఇండియా-పాక్ దాయాదుల పోరు జరిగింది. మ్యాచ్ చూసేందుకు సుమారు 1.50 లక్షల మంది హాజరయ్యారు. స్టేడియమంతా కిటకిటలాడింది. మరోవైపు ఈ మ్యాచ్ కొందరికి కాసుల వర్షం కురిపించింది.


మీడియా లెక్కల ప్రకారం ఈ మ్యాచ్ ను ప్రసారం చేస్తున్న డిస్నీ-హాట్ స్టార్ కేవలం ప్రకటనల ద్వారా రూ.150 కోట్ల వ్యాపారం చేశారని అంచనా. నాలుగేళ్ల క్రితం వరల్డ్ కప్ లో జరిగిన పాక్-ఇండియా మ్యాచ్ లో వచ్చిన దానికంటే రూ.50 కోట్లు అదనంగా సంపాదించిందని అంటున్నారు. ఇతర మ్యాచ్ లకన్నా దాయాదుల మ్యాచ్ కి ప్రకటనలకు రెట్టింపు వసూలు చేస్తారని అంటున్నారు. ఉదాహరణకి ఇతర జట్ల మ్యాచ్ ల్లో 10 సెకన్ల యాడ్ కి రూ.18 లక్షలు తీసుకుంటే, ఇండియా-పాక్ మ్యాచ్ కి మాత్రం రూ.36 లక్షల వరకు తీసుకుంటారంట. మరి ఇండియా- పాక్ ఆటా-మజాకానా…చూస్కోండి మరి…

Related News

Mohamed Siraj : సేమ్ టు సేమ్ డిట్టు దించేశారు… మహమ్మద్ సిరాజ్ కూడా కుళ్ళుకోవాల్సిందే

Travis head – SRH Fan : ఆస్ట్రేలియా గడ్డపై SRH ఫ్యాన్స్ రచ్చ చూడండి.. హెడ్ ను అడ్డంగా పట్టుకొని

IPL 2026 : SRH కోసం మరోసారి రంగంలోకి రజినీకాంత్?

World cup 2027: గిల్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ.. ఇంత దారుణమా?

Yash Dayal: RCB బౌలర్ దయాల్ కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2026 నుంచి ఔట్?

Jos Butler : ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక క్రికెట్ కు గుడ్ బై ?

Big Stories

×