E-Paper
Advertisement

నల్లమల్లలో రహస్య ఆలయం – అమర్నాథ్ ను తలపించే ఆలయ విశేషాలు

నల్లమల్లలో రహస్య ఆలయం – అమర్నాథ్ ను తలపించే ఆలయ విశేషాలు
Advertisement

SECRET TEMPLE IN NALLAMALLA: నల్లమల్ల ఆటవీ ప్రాంతంలోని రహస్య ఆలయం.. ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియని గుడి. అక్కడికి వెళ్లాలంటే దట్టమైన అడవిలో కృష్ణానది మధ్యలోకి వెళ్లాలి. ఎంతో మంది మునులు, రుషులు తపస్సు చేసిన ప్రాంతం ఎక్కడో ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

నల్లమల్ల అడవిలో కృష్టమ్మ ఒడిలో దాగి ఉందో శివాలయం. ఎంతో సాహసోపేతంగా అక్కడి చేరుకోవాలి. ఎంతో మంది మునులు, రుషులు తపస్సు చేసిన ప్రాంతం. అదే అమరగిరి మల్లయ్య సెల. తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ మండలంలో కృష్ణా నది తీరాన ఉన్న అత్యంత పురాతనమైన మరియు ప్రకృతి రమణీయమైన క్షేత్రం మల్లయ్యసెల్ల. నల్లమల అడవుల మధ్య, కృష్ణా నది బ్యాక్ వాటర్స్ పక్కన ఉన్న ఈ ప్రాంతం ఆధ్యాత్మికతకు మరియు పర్యాటకానికి నిలయంగా మారింది.

Advertisement

ఆలయ విశిష్టతలు: ఈ ఆలయం ఒక కొండ పైన, నల్లమల అటవీ ప్రాంతంలో ఉంటుంది. చుట్టూ ఎత్తైన కొండలు, పక్కనే కృష్ణా నది ప్రవాహం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. అందుకే ఈ ప్రాంతాన్ని  తెలంగాణ ఊటీగా పిలుస్తున్నారు.  స్థానికులు ఈ ఆలయాన్ని  మల్లయ్య సెల అని పిలుస్తారు. సెల అంటే కొండల మధ్య ఉండే లోయ లేదా నీటి ప్రవాహం అని అర్థం. ఇక్కడ వెలసిన మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి భక్తులు కొండ మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ యాత్ర సాహసోపేతంగానూ, ఆహ్లాదకరంగానూ సాగుతుంది.

కృష్ణా నది విహారం: అమరగిరి ఆలయానికి చేరుకోవడానికి సోమశిల నుండి లేదా అమరగిరి సమీపం నుండి పడవ ప్రయాణం (Boating) చేయవచ్చు. నది మధ్యలో ఉండే ఐలాండ్ (ద్వీపం) లాంటి ప్రదేశాలను సందర్శించడం ఇక్కడి ప్రధాన ఆకర్షణ. కృష్ణా నది అలల మధ్య ప్రయాణిస్తూ ఆలయానికి వెళ్లడం భక్తులకు మరుపురాని అనుభూతిని ఇస్తుంది.

Advertisement

ప్రాచీన చరిత్ర సంస్కృతి: ఈ ప్రాంతం ఒకప్పుడు జటప్రోలు సంస్థానాధీశుల పరిధిలో ఉండేది. ఇక్కడ మల్లయ్య స్వామి ఆలయంతో పాటు సమీపంలో అంకాలమ్మ కోట మరియు ఇతర చారిత్రక కట్టడాలు ఉన్నాయి. శైవ మరియు వైష్ణవ సంస్కృతులు రెండూ ఇక్కడ విలసిల్లేవని స్థానికులు చెప్తుంటారు.

పర్యాటక అభివృద్ధి: ఇటీవల కాలంలో అమరగిరి ఐలాండ్ మరియు మల్లయ్య సెల ప్రాంతాన్ని తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తుందని అధికారులు తెలిపారు. పర్యాటకుల కోసం ఇక్కడ కాటేజీలు (Cottages), వాచ్ టవర్లు, బోటింగ్ సౌకర్యాలు, యోగా మరియు ధ్యాన కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు.

సందర్శనకు అనువైన సమయం: ఈ ఆలయంలో తొలి ఏకాదశికి ఉత్సవాలు జరుగుతాయని స్థానికులు తెలిపారు. ఆ సమయంలో వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి పోటెత్తుతారట. అలాగే మహాశివరాత్రి పండుగ సమయంలో ఇక్కడ విశేష పూజలు జరుగుతాయని.. ఆ పూజలకు వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారని తెలిపారు. ఇంకా కార్తీక మాసంలో వన భోజనాలకు ఇక్కడికి చాలా మంది వస్తుంటారట.

ఎలా వెళ్లాలి?: హైదరాబాద్ నుండి సుమారు 180-190 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్లాపూర్‌కు వెళ్లి అక్కడి నుంచి అమరగిరి చేరుకోవచ్చు. కొల్లాపూర్‌ వరకు బస్సు సౌకర్యం ఉంటుంది. కొల్లాపూర్‌ నుంచి ప్రయివేటు వాహనాలలో వెళ్లవచ్చు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: బుధవారం పుట్టారా? మీ టాలెంటుకు  లోకం మొత్తం ఫిదా అయ్యే రోజు అప్పుడే వస్తుందట

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×