E-Paper
Advertisement

Garuda Purana: కలియుగంలో జరిగే ఘోరాల గురించి గరుడపురాణం ఏం చెప్తుందో తెలుసా..?

Garuda Purana: కలియుగంలో జరిగే ఘోరాల గురించి గరుడపురాణం ఏం చెప్తుందో తెలుసా..?
Advertisement

Garuda Purana: కలియుగంలో జరిగే ఘోరాల గురించి గరుడపురాణం ఏం చెప్తుంది. ఎలాంటి మనుషులు కలియుగంలో సుఖంగా జీవిస్తారు..? ఎవరు కష్టాల పాలవుతారు..? ఎవరికి ఆయుష్షు క్షీణించి చిన్న వయసులోనే మరణిస్తారు.. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

గరుడ పురాణం కేవలం మరణం తర్వాత జరిగే విషయాల గురించి మాత్రమే కాదు, కలియుగంలో మానవ సమాజం ఏ విధంగా మారుతుందో కూడా వివరించింది. కలియుగ అంత్య దశలో జరిగే వింతలు మరియు విపరీతాల గురించి కూడా గరుడపురాణంలో ఉందట. అసలు కలియుగాంతంలో జరిగే పరిణామాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ధర్మం మరియు భక్తి క్షీణించడం: కలియుగాంతంలో నిజమైన భక్తి కంటే బయటకి కనిపించే వేషధారణకే (గంధం బొట్లు, మాలలు) ప్రాముఖ్యత పెరుగుతుందట. మనసులో కల్మషం పెట్టుకుని బయటకి భక్తులుగా చలామణీ అవుతారట. పుణ్యం కోసం చేసే దానాలు కూడా గుర్తింపు కోసం, పేరు ప్రఖ్యాతుల కోసమే చేస్తారట.

కుటుంబ సంబంధాల విచ్ఛిన్నం: కలియుగాంతంలో రిలేషన్స్‌ అనేవి అసలు కనిపించవట. పిల్లలు తమను కన్న తల్లిదండ్రులను గౌరవించడం మానేస్తారట. భార్యాభర్తల సంబంధాలు కేవలం శారీరక ఆకర్షణ మీదనే ఆధారపడి ఉంటాయట. డబ్బు ఉన్నవాడికే బంధువులు ఉంటారట. పేదవాడు తన సొంత అన్నదమ్ములకు కూడా పరాయివాడు అవుతాడట.

Advertisement

ఆహారం మరియు ఆరోగ్యం: కలియుగాంతంలో భూమి తన సారాన్ని కోల్పోతుందట. పంటలు సరిగ్గా పండక ప్రపంచం మొత్తం కరువుకాటకాలతో అల్లాడిపోతుందట. ఏదో పండిన పంటలో కూడా సత్తువ అనేది ఉండదట. కలియుగాంతం వచ్చే సరికి  మనుషుల వయస్సు క్రమంగా తగ్గిపోతుందట. 12-15 ఏళ్లకే పిల్లలను కంటారట. 20 నుంచి 30 ఏళ్లకే ముసలితనం వస్తుందట.

పాలన మరియు సమాజం: కలియుగాంతంలో పాలకుల దోపిడీ పెరిగిపోతుందట. ప్రజా క్షేమం కోరాల్సిన పాలకులు ప్రజలను పన్నుల పేరుతో వేధిస్తారట. న్యాయం ధనవంతుల పక్షానే ఉంటుందట. అబద్ధం ఆడేవారు..  మోసం చేసేవాళ్లు సమాజంలో గొప్పవాళ్లుగా చలామణీ అవుతారట. నిజాయితీగా ఉండేవారు పిచ్చివారిగా ముద్ర పడిపోతారట.

ప్రకృతి వైపరీత్యాలు: కలియుగాంతంలో రుతువుల మార్పు వల్ల  ఎండలు మరీ ఎక్కువగా ఉంటాయట. అకాల వర్షాలు కురుస్తాయట. చలి కాలంలో ఎండలు విపరీతంగా కాస్తాయట. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో జరుగుతాయట. ఇంకా వానలు కురవక కరువు కాటకాలు ఏర్పడి.. తిండి లేక మనుషులు ఒకరిని ఒకరు చంపుకునే పరిస్థితికి చేరుకుంటారట.

గరుడ పురాణం ఇచ్చే సందేశం: ఈ వింతలన్నీ మనిషిలో పెరిగే అహంకారం మరియు స్వార్థం వల్ల వస్తాయని గరుడపురాణం చెబుతోందట. అయితే ఇంతటి ఘోర కలియుగంలో కూడా కేవలం దైవ నామస్మరణ చేయడం సత్యం పలకడం వల్లనే మనిషులు ఆ కష్టాల నుంచి బయటపడొచ్చని గరుడపురాణం సూచిస్తుందట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: నెమలి ఈకను ఇంట్లో పెట్టుకోవచ్చా..?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×