Brahmamgari Kalagnanam: బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ పరాభవ నామ సంవత్సరం ( 2026-27)లో ఎలా ఉండబోతుందో తెలుసా..? ఈ సంవత్సరం జరిగే ఘోరాలు నేరాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసా..? అసలు ఈ సంవత్సరం జరిగే సంఘటనలు ఊహించుకుంటేనే భయం పుట్టకొస్తుందట. ఇంతకీ బ్రహ్మంగారు ఏం చెప్పారో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి రచించిన ‘కాలజ్ఞానం’పై తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఎంతో నమ్మకం మరియు ఆసక్తి ఉంది. అయితే, దీని గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని మీరు గమనించాలి: కాలజ్ఞానం అనేది పద్యాలు, తాళపత్రాల రూపంలో ఉంది. దీనిని వివరించేటప్పుడు వివిధ కాలాల్లో, వివిధ పండితులు లేదా వ్యక్తులు వారి సొంత విశ్లేషణలను జోడించడం చెప్పారు. అయితే ఈ పరాభవ నామ సంవత్సరంలో (2026-27) ప్రధానంగా ఈ కింది అంశాలను కాలజ్ఞానంలో చెప్పారని పండితులు చెప్తున్నారు.
పెను మార్పులు: 2026 ఒక కీలకమైన మలుపు అని, ప్రపంచంలో ఊహించని మార్పులు సంభవించే అవకాశం ఉందని కాలజ్ఞానంలో ఉన్నట్టు పండితులు చెప్తున్నారు. ఈ సంవత్సరం ప్రకృతి వైపరీత్యాలు, సామాజిక మార్పులు సంభవిస్తాయని బ్రహ్మంగారు పేర్కోన్నట్టు చెప్తున్నారు.
ఆర్థిక పరిస్థితులు: ఈ సంవత్సరం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం బంగారం ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండవని, భవిష్యత్తులో ఆభరణాల తయారీలో మార్పులు వస్తాయని (ఉదాహరణకు చెక్కతో తాళి కట్టుకోవడం వంటివి) బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసినట్టు పండితులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం పెరుగుతున్న బంగారం ధరలు చూస్తుంటే కాలజ్ఞానం నిజమవుతున్నట్టే కదా అంటూ అన్వయిస్తు్న్నారు పండితులు.
ఉగాది ప్రాముఖ్యత: కాలజ్ఞానంలో చెప్పినట్లుగా ప్రతి సంవత్సరం వచ్చే ఉగాది నుంచి పరిస్థితుల్లో మార్పులు ఉంటాయని అలాగే 2026 ఉగాది తర్వాత పరాభవ నామ సంవత్సరంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయమని కాలజ్ఞానంలో పేర్కోన్నారట.
సామాజిక మరియు రాజకీయ అశాంతి: ఈ సంవత్సరం (2026-27) సమాజంలో అశాంతి రాజ్యమేలుతుందని నేరాలు, ఘోరాలు పెరిగిపోతాయని.. ప్రపంచ దేశాల మధ్య యుద్దాలు తీవ్ర రూపం దాలుస్తాయని కాలజ్ఞానంలో ఉన్నట్టు పండితులు చెప్తున్నారు. అలాగే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రాజకీయ అశాంతి నెలకొంటుందట. రాజకీయ నాయకులు తీవ్రమైన అవినీతిని పాల్పడతారని బ్రహ్మంగారు తెలిపారట. రాజకీయ పార్టీలు దేశంలో అస్థిరత నెలకొల్పేందుకు దిగజారుడు రాజకీయాలకు తెరలేపుతాయని.. అందుకోసం విదేశీ శక్తులతో జత కట్టవచ్చని బ్రహ్మంగారు తెలిపారట. అయితే కాలజ్ఞానంలో తెలిపిన విషయాలను కేవలం ఒక సాంస్కృతిక లేదా ఆధ్యాత్మిక కోణంలో మాత్రమే చూడటం సమంజసని.. .ప్రస్తుత పరిస్థితులకు తగినట్లుగా వ్యక్తిగత జాగ్రత్తలు మరియు ప్రణాళికలతో ముందుకు వెళ్లడం ఎల్లప్పుడూ మంచిదని పండితులు సూచిస్తున్నారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.