Big Stories

Hanuman Jayanthi: వాస్తు ప్రకారం ఇంట్లో ఆంజనేయస్వామి ఫోటో ఎక్కడ పెట్టాలో తెలుసా?

 

- Advertisement -

Hanuman Jayanthi: హనుమాన్ జయంతిని నేడు దేశ వ్యాప్తంగా ప్రజలు జరుపుకుంటున్నారు. అయితే ఈ తరుణంలో ఆలయాలకు వెళ్లలేని చాలా మంది భక్తులు ఇంట్లోనే హనుమంతుడి విగ్రహానికి పూజలు చేస్తున్నారు. అయితే చాలా మంది ఇంట్లో హనుమంతుడి విగ్రహాన్ని ఏ దిక్కున పెట్టి పూజించాలో తెలిసి ఉండదు. వాస్తు ప్రకారం ఇంట్లో హనుమంతుడి విగ్రహం లేదా ఫోటోను ఏదిశలో పెట్టి పూజలు చేస్తే అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

పూజ గదిలోని దక్షిణ దిశలో వాస్తు ప్రకారం ఆంజనేయస్వామి ఫోటోను పెట్టి పూజించడం వల్ల మంచిదని వాస్తు పండితులు చెబుతున్నారు. అయితే ఈ దిశలో కూర్చుని ఉన్న హనుమంతుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని పూజించడం మంచిది అని చెబుతున్నారు. దీని వల్ల ఇంట్లోని శక్తులన్నీ తొలగిపోతాయని చెబుతున్నారు.

Also Read: మీన రాశిలోకి కుజుడు.. 37 రోజుల పాటు ఈ 5 రాశుల వారికి అపారమైన సంపద

ఆంజనేయస్వామిని నిత్యం పూజించాలి. తరచూ హనుమంతుడి ఫోటోను పరిశుభ్రంగా ఉంచి మంగళవారం సుందరకాండ పారాయణం చేయడం వల్ల అన్ని శుభాలే జరుగుతాయి. ఇంట్లోని సమస్యలు, పీడ, చీడ, దుష్టశక్తి వంటివి కూడా తొలగిపోతాయని అంటున్నారు. మరోవైపు హనుమంతుడి ఫోటోను ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉంచడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుందని చెబుతున్నారు.

బెడ్ రూంలోను హనుమంతుడి ఫోటోను పెట్టుకోవడం వాస్తు ప్రకారం మంచిది కాదట. మెట్ల కింద, కిచెన్ లోను హనుమంతుడి ఫోటో లేదా విగ్రహాన్ని పెట్టడం వాస్తు దోషాలకి దారి తీస్తుందని చెబుతున్నారు. వాస్తు సూచనల ప్రకారం ఇలా చేస్తే సమస్యలు ఏర్పడతాయట.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News