BigTV English

Gold Bracelets:- బంగారం పట్టీలు ఎందుకు ధరించరో తెలుసా….

Gold Bracelets:- బంగారం పట్టీలు ఎందుకు ధరించరో తెలుసా….

Gold Bracelets:- మనదేశంలో ఆడపిల్లలకు వెండి పట్టీలు పెట్టడం సాధారణంగా కనిపిస్తుంది. ఎంత ఉన్న వాళ్లైనా సరే బంగారం బదులు వెండి పట్టిలు పెడుతుంటారు .కాళ్లకు వెండి పట్టీలేసుకుని గజ్జెల సప్పుడు చేసుకుంటూ ఇంట్లో ఆడపిల్లలు తిరుగుతుంటే ఆ శబ్ధం ఎంతో వినసొంపుగా ఉంటుంది. కాకపోతే వెండికి బదులు కాస్త డబ్బున్న వాళ్లు ఇప్పుడు బంగారు పట్టీలు ధరించేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం చూసినా.. శాస్త్రాల ప్రకారం చూసినా ఆడపిల్లలు కాళ్లకు వెండి పట్టీలనే ధరించాలని ఉంది.


బంగారాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవితో పురాణాల్లో చెబుతుంటారు. అందుకే బంగారాన్ని అంత పవిత్రంగా చూస్తారు. లక్ష్మీదేవిగా కొలుస్తూ మొక్కుతుంటారు. లక్ష్మీదేవికి ఇష్టమైన రంగు.. పసుపు. బంగారం కూడా పసుపు రంగులో ఉంటుంది. కాబట్టి బంగారాన్ని కాళ్లకు ధరించకూడదట. కేవలం బంగారాన్నే కాదు.. పసుపు మినహా ఆ రంగుల్లో ఉన్న ఎలాంటి వస్తువులనూ కాళ్లకు ధరించకూడదట.

సో బంగారం బదులు వెండిని ధరిస్తారు. శాస్త్రీయంగాను వెండి మన శరీరంలోని వేడిని బయటకు పంపించేస్తుందట. ఒకప్పుడు ముసలోళ్ల కాళ్లకు పెద్ద పెద్ద కడాలు, నడుముకు వడ్డాణాలు, కాళ్లకు భారీ సైజులో పట్టగొలుసులు ఉండేవి. ఇప్పుడు పట్టగొలుసులంటే ఐదారు తులాల లోపే ఉంటున్నాయి. కానీ ఒకప్పుడు పట్టగొలుసులంటే కనీసం 30-40 తులాలు ఉండేవి.


శరీరంలోని వేడిని గ్రహించి చలువ చేస్తుంది కాబట్టే అంత పెద్ద వెండి ఆభరణాలను కాళ్లకు ధరించేవారు. వెండి వల్ల దుష్టశక్తుల నుంచి రక్షణ కూడా ఉంటుందట. నెగెటీవ్‌ ఆలోచనలు కూడా రావట.పాదాలకు పట్టీలు ధరించడం వల్ల పాదాల్లో నొప్పి రాకుండా చూసుకోవచ్చు. వెండి రక్త ప్రసరణను సులభతరం చేయడంతో నొప్పులు వెంటనే తగ్గిపోతాయి. వెండి ఆభరణాలు ధరించడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

రామేశ్వరం మొక్కుని నిర్లక్ష్యం చేస్తున్నారా….అయితే…

for more updates follow this link:-Bigtv

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×