BigTV English

Kumaraswamy:- కుమారస్వామికి ఆరు అంకె అంటే ఇష్టమా…

Kumaraswamy:- కుమారస్వామికి ఆరు అంకె అంటే ఇష్టమా…

Kumaraswamy:- సుబ్రహ్మణ్యస్వామి పరమదయాళువు. భక్తుల పాలిటి కొంగు బంగారం. ఆయన్ను పూజిస్తే కలిగే ఫలితాలు అన్నీఇన్నీ కాదు. సుబ్రహ్మణ్యేశ్వరునికి ఎన్నో నామాలు. వాటిలో కుమార ఒకటైతే.. శరవణభవ ఒకటి. ఆదిదంపతుల కుమారుడు కుమారస్వామి అయ్యాడు. రెల్లు గడ్డిలో పుట్టాడు కాబట్టి శరవణ భవుడయ్యాడు. అనే సమాధానం వస్తుంది. అంతేకాదు. ఆయన దేవ సైన్యాధిపతి. పరమేశ్వరునికి సైతం ప్రతి విషయాల్లో విజయాన్ని అందించే దైవం. అందుకే… కష్టాల్లో ఉన్న వారు ఆయన్ను పూజిస్తే సకల శుభాలు కలుగుతాయ్. సుబ్రహ్మణ్యస్వామిని వేలాయుధన్ అని కూడా అంటారు. కారణం.. ఆయన చేతిలో శక్తి ఆయుధం సునిశితమైన సూక్ష్మబుద్ధికి నిదర్శనం. అందుకే.. పిల్లలు శరవణభుడ్ని ఆరాధిస్తే.. చదువు బాగా వస్తుందని వేదాలు చెబుతున్నాయ్.


కుమారస్వామికి ఆరు ముఖాలున్న దేవుడు. షష్ఠి అంటే ఆరు.మంగళకరమైన శివుని మూడవ కంటినుంచి ఉద్భవించిన జ్ఞానకిరణమే కుమారస్వామి జన్మకు కారణమైంది. రూప విశిష్టం….. కుమారస్వామికి ఆరు తలలు వుండడం చేత షణ్ముఖుడు అనే పేరు వచ్చింది. సుబ్రహ్మణ్య స్వామి మార్గశిర షష్టినాడు జన్మించాడు. అదే రోజు తారకాసురున్ని సంహరించాడు. అదే షష్టిన ఇంద్రుని కుమార్తెలయిన శ్రీదేవసేన, శ్రీవల్లీదేవిలను వివాహమాడాడు. అదే షష్టిన దేవతలకు సైన్యాధిపతి అయ్యాడు. అన్ని సంఘటనలు షష్టి పవిత్రదినాన్న సంభవించినందున సుబ్రహ్మణ్య షష్టిగా విశిష్టత సంతరించుకొని అది మహోన్నత పర్వదినంగా లోకంచే సుబ్రహ్మణ్య షష్టిగా నామకరణం జరిగి ఆరాధించబడుతోంది.

సుబ్రహ్మణ్య షష్టి రోజున సుబ్రహ్మణ్య స్వామి కృపకు పాత్రమై పాము మంత్రాలు నేర్చుకోవాలన్న విశ్వాసం ఉంది. ఈ క్రమంలో ఉపవాసం ఉండి సర్పమంత్రాన్ని దీక్షతో ఉపాసిస్తే మళ్లీ సంవత్సరం వరకు గొప్ప శక్తి ప్రభావితమై ఆ మంత్రం వచ్చి దివ్య మహిమాన్వితంగా పని చేస్తుందని నమ్మకం ఉంది. మార్గశిర షష్టినాడే చంపా షష్టి, ప్రవార షష్టి వ్రతాలను కూడా చేయాలని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి


Related News

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Big Stories

×