Balagam : రీసెంట్ టైమ్‌లో చిన్న చిత్రంగా విడుదలై ఘన విజయాన్ని అందుకుంది బలగం. కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వంలో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం పక్కా తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో రూపొందింది. కుటుంబంలో అందరి మధ్య బంధాలు, అనుబంధాలు ఉండాలని చెప్పే ఈ చిత్రానికి వచ్చిన రెస్పాన్స్ మామూలుగా లేదు. ఇప్పటికే ఈ సినిమాకు 9 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. సామాన్యులు, సెలబ్రిటీలతో పాటు పొలిటీషియన్స్ సైతం ఈ సినిమాను చూసి అభినందనలు తెలియజేస్తున్నారు.
ఈ సినిమా సక్సెస్‌లో ప్రతి అంశం కీలక భూమిక పోషించినప్పటికీ క్లైమాక్స్ మాత్రం నెక్ట్స్ రేంజ్‌లో కుదిరింది. అందుకు కారణం.. రొటీన్‌కి భిన్నంగా దర్శకుడు వేణు క్లైమాక్స్‌ను పాట రూపంలో తెరకెక్కించారు. అలాగని అదేదో రొటీన్ పాట అని అనుకోకండా ఇది బుడగ జంగమలు పాడుకునే పాట. బలగం సినమాలో ఆ పాటను పాడిండి మొగిలయ్య అనే తెలంగాణ కళాకారుడు. ఆ పాటతో ఆయనకు చాలా మంచి పాపులారిటీ దక్కింది. అయితే ఇప్పుడాయన ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగోలేదు. ఇప్పటికే రెండు కిడ్నీలు పని చేయటం లేదు. దీంతో వారానికి మూడు సార్లు డయాలసిస్ చేస్తున్నారు. ఈ క్రమంలో మొగిలయ్యకు హార్ట్‌స్ట్రోక్ వచ్చింది. దీంతె తన భర్తకు వైద్యం సాయం అందించాలని మొగిలయ్య భార్య ప్రభుత్వానికి విన్నవించుకుంటోంది.
అప్పటికప్పుడు సందర్భానుసారం పాటను అల్లి పాడటం మొగిలయ్య దంపతుల ప్రత్యేకత. బలగం సినిమా కోసం దర్శకుడు వేణు ఎల్దండి చాలా కష్టపడి మొగిలయ్యను కలిసి ఆయన దగ్గర రెండు రోజులు ఉండి బుడగ జంగమ పాటను పాడించుకున్నారు. ఆ పాటతో మొగిలయ్యకు చాలా మంచి పేరు వచ్చింది. దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా ఓటీటీలో విడుదలైనప్పటికీ థియేటర్స్ల్ లో సక్సెస్ ఫుల్ గా సినిమా రన్ అవుతుంది.