Chaturgrahi Yoga 2025: ఏప్రిల్ 14, 2025 సోమవారం రోజు గ్రహాలకు అధిపతి అయిన బుధుడు, కర్మఫలదాత శనిదేవుడు, రాక్షస గురువు శుక్రుడు అంతే కాకుండా అదృశ్య గ్రహం అయిన రాహువుల కలయిక మీన రాశిలో జరగనుంది. ఫలితంగా చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం అనేక రాశుల వారి ఆర్థిక స్థితిలో పెద్ద మార్పును కలిగిస్తుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు కాలానుగణంగా సంచరిస్తూనే త్రిగ్రాహి, చతుర్గాహి యోగాలను ఏర్పరుస్తాయి. ఇది మానవ జీవితంలో ప్రభావం చూపుతాయి. ఇదిలా ఉంటే గ్రహాల రాజు సూర్యుడు ఈ రోజు అంటే ఏప్రిల్ 14 రోజు మీన రాశి నుండి బయలు దేరి మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు రాశి మారిన వెంటనే మీన రాశిలో చతుర్గాహి యోగం ఏర్పడుతుంది. మీన రాశిలో రాహువు, శని, శుక్రుడు, బుధుడు ఈ యోగాన్ని ఏర్పరుస్తాయి. ఈ చతుర్గ్రాహి యోగం 12 రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. ఫలితంగా ఏ రాశుల వారికి ఎక్కువ ప్రయోజనాలు అందుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
కన్య రాశి:
చతుర్గ్రహి యోగం వల్ల కన్య రాశి వారికి మంచి లాభాలు అందుతాయి. వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అంతే కాకుండా మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా పొందుతారు. వ్యాపారవేత్తల ఆదాయంలో అకస్మాత్తుగా పెరుగుదల ఉంటుంది. ఇంకా వివాహం కాని వారికి ఈ కాలం చాలా శుభప్రదంగా ఉంటుంది. విద్యార్థులు శుభ వార్తలు వింటారు. ఉన్నతాధికారుల నుండి ఉద్యోగులు ప్రశంసలు కూడా అందుకుంటారు. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. అంతే కాకుండా మీరు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
వృషభ రాశి:
చతుగ్రహి యోగం యొక్క శుభ ప్రభావం కారణంగా.. వృషభ రాశి వారి జీవితాల్లో సానుకూల మార్పులు కనిపిస్తాయి. ఈ వ్యక్తులకు కొత్త ఆదాయానికి కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి. అలాగే.. జీవితంలో జరుగుతున్న అనేక తీవ్రమైన సమస్యలు పరిష్కరించబడతాయి. ఈ సమయంలో పెట్టుబడి పెట్టే డబ్బు భవిష్యత్తులో మంచి రాబడిని ఇస్తుంది. అంతే కాకుండా మీ కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు లభిస్తుంది. ఉన్నతాధికారుల నుండి కూడా మీరు ప్రశంసలు అందుకుంటారు. డబ్బు ఖర్చు చేసే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహాలు తీసుకోండి.
ALSO READ: లక్ష్మీ నారాయణ రాజయోగం.. ఈ 4 రాశుల వారు జాక్ పాట్ కొట్టినట్లే !
కర్కాటక రాశి:
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులు చతుర్గ్రహి యోగం యొక్క శుభ ప్రభావం కారణంగా అదృష్టాన్ని పొందుతారు. మీ పనను అకస్మాత్తుగా నెరవేరడం ప్రారంభమవుతుంది. మీరు మీ భాగస్వామితో ఎక్కడికైనా బయటకు వెళ్లాలని కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఈసారి చాలా శుభవార్తలు అందుతాయి. గతం కంటే మీ ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. అంతే కాకుండా మీ పెట్టుబడులకు లాభాలు కూడా ఎక్కువగా వస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.