Fans Fight at Stadium: ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 18వ ఎడిషన్ చాలా ఆసక్తికరంగా సాగుతోంది. అంతా ఊహించినట్లుగానే ఈ సంవత్సరం అన్ని జట్ల బ్యాటర్లు భారీ ప్రదర్శనను కనబరుస్తున్నారు. ముఖ్యంగా బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు ఫుల్ మీల్స్ ఎంటర్టైన్మెంట్స్ ని అందిస్తున్నాయి.
Also Read: Shikhar Dhawan Sophie Shire: ప్రియురాలితో ధావన్… పెళ్లికాకముందే ప్రెగ్నెంట్!
ఓవైపు ఈ సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతుండగా.. మరోవైపు అభిమానుల్లో ఉద్వేగాలు కట్టలు తెంచుకుంటున్నాయి. ప్రతి మ్యాచ్ కి స్టేడియాలు జనంతో కిక్కిరిసిపోతున్నాయి. అభిమానుల మద్దతు మరింత అధిక స్థాయికి చేరుకుంటుంది. కానీ ఈ ఉద్వేగాలు కొన్ని సందర్భాలలో నియంత్రణ కోల్పోతున్నాయి. తాజాగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన గొడవ దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆదివారం రోజు ఢిల్లీ క్యాపిటల్స్ – ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ కి స్టేడియంలో భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరై.. తమ తమ జట్టును ఉత్సాహపరుస్తూ హోరెత్తించారు.
అయితే ఈ హై వోల్టేజ్ మ్యాచ్ లో {DC vs MI} ఒక దశలో అభిమానులు తమ నియంత్రణ కోల్పోయారు. వైరల్ గా మారిన ఈ వీడియోలో స్టేడియంలో యువకుడుని దారుణంగా కొట్టింది ఓ ఖిలాడీ లేడి. ఈ వీడియోలో ఆ అమ్మాయి.. యువకుడిని దారుణంగా కొడుతూ కనిపించింది. అనంతరం మిగతా అభిమానులు కూడా ఒకరినొకరు తోసుకుంటూ రచ్చ చేశారు. అయితే ఈ గొడవ ఎందుకు జరిగిందనే విషయం స్పష్టంగా తెలియరాలేదు కానీ.. ఆ యువతి మాత్రం యువకుడిపై దారుణంగా దాడి చేయడం స్పష్టంగా కనిపించింది.
భద్రతా సిబ్బంది ఘటన జరిగిన వెంటనే రంగ ప్రవేశం చేసి.. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ఈ యువతి, యువకుడి మధ్య జరిగిన గొడవ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 18, హార్దిక్ పాండ్యా 2.. మినహా మిగతా బ్యాటర్లంతా రాణించారు.
Also Read: Umpire Checking Bat: RCB కుట్రలు… మ్యాచ్ గెలిచేందుకు ఇల్లీగల్ బ్యాట్స్!
రికెల్టన్ 41, సూర్య కుమార్ యాదవ్ 40, తిలక్ వర్మ 59, నమన్ ధీర్ 38* పరుగులతో రాణించారు. ఢిల్లీ బౌలర్లలో విప్రజ్, కుల్దీప్ చెరో రెండు వికెట్లు, ముఖేష్ ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 193 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. కరుణ్ నాయర్ మెరుపు ఇన్నింగ్స్ తో 89 పరుగులు చేసినప్పటికీ నిరుపయోగంగా మారింది. చివర్లో బుమ్రా బౌలింగ్ 18 ఓవర్లో రన్ అవుట్ లకు ముగ్గురు బ్యాటర్లను కోల్పోయి చివరకు ఓటమిని చవిచూసింది.
A fight between fans at the Arun Jaitley stadium last night. pic.twitter.com/UYXmAZbg1c
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 14, 2025
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">