BigTV English

Lady Aghori : మొదటి భార్య ఎలాంటిదంటే.. అఘోరీ చెప్పిన అసలు నిజాలు..

Lady Aghori : మొదటి భార్య ఎలాంటిదంటే.. అఘోరీ చెప్పిన అసలు నిజాలు..

Lady Aghori : అఘోరీ వెడ్స్ వర్షిణి. ఇది లేటెస్ట్ న్యూస్. అఘోరీకి అంతకుముందే పెళ్లైంది. తానే ఆయన భార్యను అంటూ రాధిక అనే మహిళ మీడియా ముందుకు వచ్చింది. ఇది ఇంకా లేటెస్ట్ అప్‌డేట్. ఏడాది క్రితమే.. జనవరి 1న.. తన మెడలో లేడీ అఘోరీ తాళి కట్టిందని చెబుతోంది. వర్షిణిని పెళ్లి చేసుకుందని తెలిసి తాను అసలు నిజాలు చెప్పేందుకు బయటకు వచ్చాననేది రాధిక మాట. అఘోరీ తనకు పంపిన ఆడియో మెసేజ్‌లనూ మీడియాకు రిలీజ్ చేసింది. అందులో ఐ లవ్ యూ రాధే.. నువ్వు లేక నా గుండెలో పెయిన్‌గా ఉందే.. నువ్వే నా పెళ్లామే.. అంటూ అఘోరీ ముద్దు ముద్దు మాటలు చాలానే ఉన్నాయి. కట్ చేస్తే…


ఐ లవ్ యూ అందుకు చెప్పానంటే..

ఆమె అసలు తన భార్యనే కాదంటోంది అఘోరీ. రాధిక మేటర్ బయటకు రాగానే.. గంటల వ్యవధిలోనే ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. రాధిక ఓ అడ్వకేట్ అని.. ఆమె భర్త నుంచి విడిపోయి.. తన దగ్గరికి చేరిందని చెబుతోంది లేడీ అఘోరీ. చచ్చిపోతానంటూ బెదిరిస్తే.. పెళ్లి చేసుకుంటాలే అని అన్నానని అంటోంది. తనను కాపాడమని వేడుకుంటేనే.. ఆమెను ఓదార్చడానికే ఐ లవ్ యూ.. ఐ మిస్ యూ అంటూ మెసేజ్‌లు పంపించానని చెబుతోంది. కేవలం తన వాయిస్ మాత్రమే బయటపెట్టిన రాధిక.. ఆమె మాట్లాడిన ఆడియో రికార్డింగ్స్ కూడా మీడియాకు ఇవ్వాలని ఛాలెంజ్ చేస్తోంది. ఆశ్రమం కట్టడానికి తాను రాధికకు పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చానని.. ఆ డబ్బు మళ్లీ తిరిగి ఇచ్చేసిందని.. ఆ బ్యాంక్ స్టేట్‌మెంట్స్ కూడా చూపించాలని డిమాండ్ చేస్తోంది లేడీ అఘోరీ.


రాధిక వెనుకున్నది ఎవరు?

ఇన్ని రోజులు లేనిది.. తాను వర్షిణిని పెళ్లి చేసుకున్నాకే.. రాధిక ఎవరో చెబితే ఇప్పుడు మీడియా ముందుకు వచ్చిందనేది అఘోరీ ఆరోపణ. తాము పెళ్లి చేసుకుంటే.. అందుకు రుజువులు చూపించాలని డిమాండ్ చేశారు అఘోరీ. ఇవన్నీ కల్పితాలేనని ఖండించారు.

Also Read : కుక్కలను రేప్ చేసిన యువకుడు..

అసలేం జరిగిందంటే…

అఘోరీ ఎపిసోడ్ అనేక మలుపులు తీసుకుంటోంది. ముందు సనాతన ధర్మం కోసం పోరాటమంది. నగ్నంగా తిరుగుతూ.. కొన్నాళ్ల పాటు తెలుగు రాష్ట్రాల్ల రచ్చ రచ్చ చేసింది. ఆ తర్వాత శ్రీవర్షిణి ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆమెతో కలిసి పారిపోవడం.. గుజరాత్‌లో పట్టుకుని వర్షిణిని తీసుకురావడం జరిగింది. అంతలోనే తామిద్దరం పెళ్లి చేసుకున్నామంటూ వర్షిణి సంచలన విషయం చెప్పేసి.. మళ్లీ అఘోరీతో వెళ్లిపోయింది. ఇక అఘోరీ మేటర్ క్లోజ్ అనుకుంటుండగా.. రాధిక అనే మరో మహిళ ఎంట్రీ ఇచ్చింది. అఘోరీ నా మొగుడంటూ.. కొండగట్టు ఆలయంలో తనకు తాళి కట్టాడంటూ ముందుకొచ్చింది. తాను అతని మొదటి భార్యనంటూ సీన్‌లోకి వచ్చి.. ఆడియో రికార్డింగ్స్ వదిలింది. తనలానే వర్షిణి జీవితం కూడా నాశనం చేస్తున్నారని.. అఘోరీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. రాధికకు రుద్రస్వామి సపోర్ట్‌గా నిలిచారు. వారికి కౌంటర్‌గా అఘోరీ సెల్ఫీ వీడియోతో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆమెకు తాను తాళి కట్టలేదని.. చచ్చిపోతా కాపాడు అంటే సరే నన్నానని చెబుతోంది అఘోరీ. దమ్ముంటే తాము పెళ్లి చేసుకున్నట్టు సాక్షాలు, ఆధారాలు చూపించాలనేది లేడీ అఘోరీ డిమాండ్.

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×