Lucky Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న అన్ని గ్రహాలలో చంద్రుడు అత్యంత వేగంగా కదిలే గ్రహంగా చెబుతారు. చంద్రుడు మనస్సు , తల్లిని సూచించే గ్రహంగా కూడా పరిగణించబడ్డాడు. కర్కాటక రాశి వారికి అధిపతి చంద్రుడు. ఇదిలా ఉండే చంద్రుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ కర్కాటక రాశి వారిపై ఉంటాయి. ఇది మాత్రమే కాదు.. చంద్రుడు రాశి మారే ప్రతిసారీ, దాని ప్రభావం 12 రాశిచక్రాలపై కనిపిస్తుంది. ఈ సమయంలో.. చంద్రుడు ఇతర గ్రహాలతో పాటు శుభ, అశుభ రాజయోగాన్ని కూడా సృష్టిస్తాడు.
చంద్రుడు మరోసారి ఒక ప్రభావవంతమైన రాజయోగాన్ని సృష్టించబోతున్నాడు. ఇది ఒక వ్యక్తి జీవితాన్ని అలాగే దేశం , ప్రపంచ వ్యవహారాలను ప్రభావితం చేస్తుంది. పంచాంగం ప్రకారం.. చంద్రుడు 20 ఏప్రిల్ 2025న సాయంత్రం 6:04 గంటలకు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలాంటి పరిస్థితిలో వృషభ రాశిలో ఉన్న బృహస్పతి గజకేశరి రాజయోగాన్ని సృష్టిస్తున్న చంద్రుడిని చూస్తాడు. ఈ శక్తివంతమైన యోగా కారణంగా.. మకర రాశి సహా ఈ రెండు రాశుల వారు వ్యాపారం, ఉద్యోగంలో ఆశించిన ఫలితాలను పొందుతారు. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వృశ్చిక రాశి:
జ్యోతిష్కుల అభిప్రాయం ప్రకారం.. గజకేసరి రాజయోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీ ఆదాయం పెరుగుతుంది. అంతే కాకుండా ఈ యోగం ప్రభావం వల్ల జీవితంలో ఎదురయ్యే సమస్యలు తొలగిపోయి ఆనందం కలుగుతుంది. మీ వైవాహిక జీవితంలో మీరు సంతోషకరమైన క్షణాలను కూడా ఆస్వాదిస్తారు. ప్రభుత్వ పనిని పూర్తి చేయడంలో ఏదైనా సమస్య ఉంటే.. అవి తొలగిపోతాయి. ఈ సమయంలో.. మీ వ్యాపారంలో భాగస్వామ్యం ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఆస్తులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
మకర రాశి:
గజకేసరి రాజయోగం మకర రాశి వారికి అనేక సానుకూల మార్పులను తీసుకురాబోతోంది. ఈ సమయంలో ఉద్యోగస్తులకు కార్యాలయంలో ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. దీని కారణంగా కెరీర్‌లో పురోగతి సాధ్యమవుతుంది. అదే సమయంలో.. వివాహం చేసుకోలేకపోయిన వారి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కూడా ఉంది. ఈ వ్యక్తులు జీవితంలో విజయం, ఆనందం, శ్రేయస్సును పొందుతారు. అంతే కాకుండా మీరు లోన్ కోసం దరఖాస్తు చేసుకుంటే, అది కూడా ఆమోదించబడుతుంది. ఒంటరి వ్యక్తుల జీవితాల్లోకి ఈ సమయంలో ఎవరో ఒకరు వస్తారు.
Also Read: వైశాఖ మాసం ప్రాముఖ్యత, ఈ సమయంలో దానం చేయడం వల్ల కలిగే పుణ్య ఫలాలు !
కుంభ రాశి:
గజకేసరి రాజయోగం కుంభ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ పనులన్నీ మీరు కోరుకున్న విధంగా పూర్తవుతాయి. మీరు ధ్యానం, సాధన వంటి కార్యకలాపాలలో పాల్గొంటారు. మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. మీ కుటుంబం నుండి కూడా మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. చాలా కాలంగా ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఈ సమయం సానుకూల మార్పులను తెస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు విజయ సంకేతాలు ఉన్నాయి. అంతే కాకుండా చాలా కాలంగా పెండింగ్ లో పనులు ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు. ఆస్తి, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు.