Dispute With Wife Man Kills Sister In Law| పదేళ్ల బాలికను హత్య చేసినందుకు ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ హత్య కేసులో షాకింగ్ విషయాలు తెలిశాయి. ఎవరో చేసిన తప్పుకు ఆ బాలికను అన్యాయంగా చంపేశాడు. ఈ ఘటన హర్యాణాలోని గురుగ్రామ్ నగరంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. గురుగ్రామ్ లోని పాలం విహార్ పోలీస్ స్టేషన్ గత సోమవారం ఓ పదేళ్ల బాలిక కనిపించడం లేదంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఇంటి నుంచి స్కూల్ కెళ్లిన తన కూతురు రెండు రోజులుగా కనిపించడం లేదని.. అన్ని చోట్ల వెతికినా లాభం లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాలిక మిస్సింగ్ కేసుని సీరియస్ గా తీసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. కానీ ఎక్కడా బాలిక ఆచూకీ లభించలేదు. దీంతో విచారణ మళ్లీ మొదటి నుంచి ప్రారంభించారు.
ముందుగా బాలిక తండ్రిని అదుపులోకి తీసుకొని అన్ని వివరాలు చెప్పమని పోలీసులు అడిగారు. అతనికి ఇద్దరు కూతుర్లు. పెద్ద కుమార్తె పేరు నికిత, ఆమెకు వివాహం జరిగి ఆరు సంవత్సరాలు అవుతోంది. రెండు కుమార్తె సానియా (6) చదువు కుంటోంది. సానియా ఇప్పుడు కనిపించడం లేదు. అయితే బాలికను ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా? అనే కోణంలో దర్యాప్తు చేశారు. అందుకు గాను బాలిక తండ్రిని ఎవరితోనైనా శత్రుత్వం, గొడవలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. అప్పుడు అతను తనకు ఎవరూ శత్రువులు లేరని.. రెండు వారాల క్రితం తన అల్లుడు గొడవ చేశాడని తెలిపాడు. తన పెద్ద కూతరు, అల్లుడి మధ్య గొడవలు జరుగుతుండగా.. తాను అందులో కలుగుజేసుకోలేదని.. దాని వల్లే అల్లుడు కోపంగా ఉండడాని చెప్పాడు.
దీంతో పోలీసులు ముందుగా అతని అల్లుడు కుమార్ ని (24) అదుపులోకి తీసుకున్నారు. కుమార్ గురించి పూర్తి సమాచారం సేకరించగా.. అతను బిహార్ రాష్ట్రంలోని ముంగేర్ జిల్లాకు చెందనివాడిగా తెలిసింది. అతను గురుగ్రామ్ లో ఉద్యోగం చేస్తూ స్థిరపడ్డాడు. కుమార్ తో నికితకు ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వారిద్దరి రెండేళ్ల కూతరు కూడా ఉంది. తక్కువ వయసులోనే ఇద్దరికీ వివాహం జరగడంతో మానసిక పరిపక్వత లేకపోవడం.. ఇద్దరి మనస్తత్వాలు వేరుగా ఉండడంతో తరుచూ గొడవలు జరిగేవి. ఈ కారణంగా నికిత తన భర్తు వదిలేసి తన కూతురిని తీసుకొని పుట్టింటికి వచ్చేసింది.
Also Read: ఐపిఎల్ చూస్తూ ప్రమాదవశాత్తు తుపాకీ పేల్చిన బాలుడు.. పొరుగింటి వ్యక్తి మృతి
గత కొన్ని నెలలుగా పుట్టింట్లోనే నికిత ఉంటోంది. దీంతో కుమార్ తన భార్యను తిరిగి కాపురానికి రావాల్సిందిగా పలుమార్లు కోరాడు. కానీ ఆమె వినిపించికోలేదు. పైగా ఆమె తల్లిదండ్రులు కూడా నికితకు అండగా నిలబడ్డారు. ఈ కారణంగా కుమార్ తన అత్తమామలతో కూడా గొడవ పడ్డాడు. ఒకసారి అయితే నికిత తండ్రి చొక్కా పట్టుకొని కొట్టబోయాడు. ఇదంతా విన్నాక పోలీసులు.. సానియా మిస్సింగ్ కేసులో కుమార్ హస్తం ఉందని అనుమానించారు. అందుకే అతడిని తమ పద్ధతిలో ప్రశ్నించగా.. మొత్తం చెప్పేశాడు.
తాను ఇంట్లో ఒంటరితనంతో బాధపడుతున్నానని.. దీనంతటికీ కారణం తన భార్య నికిత అని చెప్పాడు. తన చిన్నారి కూతురిని కూడా చూడనివ్వడం లేదని చెప్పాడు. అందుకే ఆమెకు, ఆమె తల్లిదండ్రులకు గుణపాఠం చెప్పాలని భావించి స్కూల్ నుంచి వస్తున్న తన మరదలిని కిడ్నాప్ చేసేందుకు ఆమెను తన బైక్ పై తన ఇంటికి తీసుకెళ్లానని.. ఐస్ క్రీమ్ కోసం ఆశపడి చిన్నారి సానియా తనతో వచ్చిందని చెప్పాడు. కానీ ఇంట్లో తీసుకెళ్లాక సానియ గొంతు నులిమి చంపేశానని చెప్పాడు. ఆ తరువాత బాలిక శవాన్ని ఒక బెడ్ షీట్ లో చుట్టి.. ఆ తరువాత ఒక ప్లాస్టిక్ షీట్ లో చుట్టి దూరంగా ఉన్న బజ్ ఘేరా డ్రైనేజీలో పడేశానని తెలిపాడు.
పోలీసులు.. ఆ అతిపెద్ద డ్రైనేజీ నుంచి అతికష్టం మీద శవాన్ని వెలికితీశారు. కుమార్ పై సానియా హత్య కేసు నమోదు చేసి మిగతా విచారణ పూర్తి చేస్తామని తెలిపారు.