BigTV English

KTR: కేటీఆర్ వార్నింగ్.. ఆయన్ని ఫాలో అవుతున్నారా?

KTR: కేటీఆర్ వార్నింగ్.. ఆయన్ని ఫాలో అవుతున్నారా?

KTR: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు విచిత్రంగా ఉంటాయి. ఒక్కోసారి ఏపీ తరహాలో తెలంగాణలో రాజకీయాలు సాగుతాయి.  అఫ్ కోర్స్ కారణాలు ఏమైనా కావచ్చు.  కాకపోతే కొన్ని విషయాల్లో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ను బీఆర్ఎస్ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. మరికొందరైతే బీఆర్ఎస్‌నే జగన్ ఫాలో అవుతారని అంటుంటారు. ఇక అసలు విషయానికి వద్దాం.


రాజకీయాల్లో ట్రెండ్ మారిందా?

రాజకీయాల్లో ట్రెండ్ మారింది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత నిత్యం వార్తల్లో ఉండాలనుకుంటారు కొందరు నేతలు. లేకుంటే ప్రజలు తమను మరచిపోతారని భావిస్తుంటారు. ఈ క్రమంలో అనుకోకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సందర్భాలు లేకపోలేదు. అలాంటి వారిలో కేటీఆర్ కూడా. రోజు లేదా రెండురోజుల కొకసారి ఏదో ఒక అంశాన్ని మీడియా ముందుకు తెచ్చి వార్తల్లో ఉండాలని భావిస్తుంటారు ఆయన.


ఏపీ కంటే తెలంగాణలో రాజకీయాలు కాస్త హుందాగా ఉంటాయని సమయం, సందర్భం వచ్చినప్పుడు కొందరు నేతలు ఓపెన్‌గా చెబుతారు. ఇక అసలు విషయానికి వద్దాం. తాజాగా గురువారం మీడియా ముందుకొచ్చిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. నేరుగా పోలీసులకు వార్నింగ్ ఇచ్చారాయన.

పోలీసులకు వార్నింగ్ వెనుక

కొంతమంది పోలీసులు రేవంత్‌రెడ్డి ప్రైవేటు సైన్యంలా పని చేస్తున్నారని ఆరోపించారు. అలాంటివారిని వదిలిపెట్టేదన్నారు. ఇష్టానుసారంగా అడ్డమైన కేసులు పెడుతున్నారని అన్నారు. తాము సుప్రీంకోర్టుకి వెళ్తే మీరు ఊచలు లెక్క బెట్టాల్సి వస్తుందన్నారు. న్యాయస్థానంలో చీవాట్లు తినాల్సి వస్తుందని హెచ్చరించారు. రీట్వీట్లు చేస్తే కేసులు పెడతారా? అంటూ ప్రశ్నించారు.

ALSO READ: వారిపై ఉక్కుపాదం.. దొరికితే సమ్మర్‌లో ఇబ్బందులు తప్పవు

కేటీఆర్ మాటల వెనుక కారణాలు చాలానే ఉన్నాయని అంటున్నారు కొందరు కాంగ్రెస్ నేతలు. ఎందుకంటే కంచ గచ్చిబౌలి వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలు ట్వీట్లు చేశారు. దాన్ని చాలామంది రీట్వీట్ చేశారు. వారిలో సామాన్యులు, కొందరు అధికారులు ఉన్నారట. ఏఐ ద్వారా వాటిని క్రియేట్ చేశారని అంటున్నారు పోలీసులు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరికి నోటీసులు ఇస్తున్నారు.

జగన్‌ని ఫాలో అవుతున్న కేటీఆర్?

ఈ పరిణామాల కారణంగా ఆయన పోలీసులకు వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు. కేటీఆర్ వ్యవహరశైలిని గమనించిన కొందరు నేతలు ఏపీ నేతలను ఫాలో అవుతున్నారని అంటున్నారు. ఏదైనా జిల్లా టూర్ వెళ్లిన తర్వాత  పలుమార్లు పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్. పోలీసు అధికారుల బట్టలు ఊడదీయిస్తానని చెప్పారు.

తొలుత లైట్‌గా కొందరు అధికారులు, ఆ తర్వాత సీరియస్‌గా రియాక్ట్ అయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.  కేటీఆర్ మాటలపై ఆ కొందరు అధికారులు రేపోమాపో రియాక్ట్ కావడం ఖాయమని అంటున్నారు. మొత్తానికి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే జగన్‌ని కేటీఆర్ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోందని కొందరి నేతల మాట.

 

హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.

 

Related News

SC Stay On Elections: గిరిజన వర్సెస్ గిరిజనేతర.. ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే

Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Hyderabad News: పండగ సమీపిస్తున్న వేళ.. జోరుగా నాన్ డ్యూటీ లిక్కర్, అధికారులు ఉక్కుపాదం

Big Stories

×