E-Paper
Advertisement

Mars Jupiter Conjunction: గురు, కుజుడి సంచారం.. ఆగస్టు 26 వరకు ఈ రాశుల వారికి కష్టాలు !

Mars Jupiter Conjunction: గురు, కుజుడి సంచారం.. ఆగస్టు 26 వరకు ఈ రాశుల వారికి కష్టాలు !
Advertisement

Mars Jupiter Conjunction: బృహస్పతి ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. మరో రెండు రోజుల్లో అన్ని గ్రహాలకు అధిపతిగా భావించే అంగారకుడు కూడా ఇదే గృహంలో ప్రవేశిస్తాడు. సుమారు 12 సంవత్సరాల తర్వాత వృషభరాశిలో కుజుడు, గురు గ్రహాల కలయిక ఏర్పడుతుంది. జూలై 12న కుజుడు, బృహస్పతి ఉన్న వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆగస్టు 26 వరకు కుజుడు, గురు గ్రహాల కలయిక ప్రభావం ఉంటుంది. జ్యోతిష్యశాస్త్రంలో రెండు గ్రహాల కలయికను శుభప్రదంగా భావిస్తారు.

గురు, కుజుడి కలయిక కొన్ని రాశులకు అనుకూల ఫలితాలను ఇస్తుంది. కుజుడు వృషభరాశిలో 45 రోజుల పాటు ఉంటాడు. అప్పటి వరకు ఈ నాలుగు రాశుల వారికి మాత్రం ఇబ్బంది కలుగుతుంది. అవి ఏ రాశులో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి:
రెండు గ్రహాల కలయిక వృషభరాశిలో జరుగుతుంది. ఈ సమయం వృషభ రాశి వారికి బాధాకరంగా ఉంటుంది. ఈ కాలంలో తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపార సంబంధిత పనుల్లో అడ్డంకులు ఏర్పడతాయి. కానీ కాలక్రమేణా పరిస్థితులు అనుకూలంగా మారతాయి. ఈ సమయంలో ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకపోవడం మంచిది. లేదంటే మీరు ఇచ్చిన డబ్బును తిరిగి మీరు చేరుకోకపోవచ్చు.
మిథున రాశి:
మిథున రాశి వారు ఈ కాలంల జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరిగే అవకాశముంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. పని చేసే చోట సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండండి.
తులా రాశి:
ఈ కాలంలో తులా రాశి వారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరిస్థితి బలహీనంగా మారే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు డబ్బు విషయంలో జాగ్రత్తలు పాటించాలి. లావాదేవీలు నష్టపోయే ప్రమాదం ఉంది. కెరీర్ పరంగా విద్యార్థులు కష్ట పడి చదవాలి. అప్పుడే మంచి ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం పట్ల జాగ్రతలు అవసరం.
కుంభ రాశి :
ఈ సమయంలో కుంభ రాశి వారు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది . వాహనాన్ని ఉపయోగించప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ కెరీర్‌లో మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. డబ్బుకు సంబంధించిన విషయాలలో జాగ్రత్త తీసుకోవడం అవసరం. మీరు ఊహించని విధంగా డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది. వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతాయి.

Advertisement

Also Read: ఈ 3 రాశుల వారికి ఆపద వచ్చే అవకాశం.. తస్మాత్ జాగ్రత్త..

గురు, కుజ గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికి మాత్రం మేలు చేస్తుంది. అనుకోకుండా వీరు ధనలాభం పొందుతారు. సమాజంలో కీర్తి, ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. మేషం. ధనస్సు రాశుల వారికి రెండు గ్రహాలు అనుకూల ప్రయోజనాలు ఇస్తాయి. సంపద పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వృత్తి పురోభివృద్ధికి అనేక అవకాశాలు రావడంతో ఆనందంతో పొంగిపోతారు. ధార్మిక కార్యక్రమాల పట్ల అధిక ఆసక్తి కనబరుస్తారు. అంతే కాకుండా మతపరమైన ప్రదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×