BigTV English

Naveen Polishetty: హీరో నవీన్ పొలిశెట్టి కీలక నిర్ణయం, అందుకేనా..?

Naveen Polishetty: హీరో నవీన్ పొలిశెట్టి కీలక నిర్ణయం, అందుకేనా..?

Naveen Polishetty latest news(Tollywood celebrity news): ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా..మంచి కాన్సెప్ట్‌తో నడుస్తున్న మూవీస్ ట్రెండ్ నడుస్తోంది. ఆడియెన్స్‌ టేస్ట్‌కి తగ్గట్టుగా మూవీలో పస లేనిదే నడిచే ధోరణి నిపిస్తలేదు.అందుకనుగుణంగా స్టోరీని ఎంచుకునే పనిలో పడ్డారు టాలీవుడ్ హీరోలు.ఈ మధ్య సరైనా స్టోరీలు దొరక్క చాలామంది హీరోలు సినిమాలను ఎంచుకునే పనిలో పడ్డారు.అందులో మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉన్నా సరే హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. ఇక టాలీవుడ్‌ హీరోలకు సరైనా హిట్ స్టోరీలు దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదే కోవలోకి ఎంట్రీ ఇచ్చాడు జాతిరత్నాలు మూవీతో ఆడియెన్స్‌ని ఆకట్టుకున్న హీరో నవీన్ పొలిశెట్టి, ఆ మూవీ తరువాత రెండు మూడు మూవీస్ చేసినా..సరైనా హిట్‌లు లేక స్టోరీ కరెక్ట్ లేక నానా ఇబ్బందులకు గురవుతున్నాడు.చాలామంది టాలీవుడ్ ఫ్యాన్స్ తన కామెడీకి ఫిదా అవుతున్నారు.


అంతేకాకుండా నవీన్‌ స్పాంటేనియస్ కామెడికి స్పెషల్ టీమ్ తనని ఇప్పటికి అనుకరిస్తారని టాక్‌. ఇక తన కెరీర్‌లో వచ్చిన ఫస్ట్ కామెడీ థ్రిల్లర్ మూవీ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ.ఈ మూవీ 2019 ఏడాదిలో రిలీజై పాజిటివ్ టాక్‌తో ఘనవిజయం సాధించింది.అదే ఏడాది హిందీ మూవీస్‌లోనూ యాక్ట్ చేసిన మనోడు హిందీలో వచ్చిన చిచోర మూవీలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్‌తో కీ రోల్ పోశించి తన టాలెంట్‌తో అధ్భుతంగా యాక్ట్ చేశాడు. అంతేకాదు ఈ మూవీ చాలా పెద్ద హిట్ అయ్యింది.ఆ తరువాత 2021లో అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన టాలీవుడ్ మూవీ జాతి రత్నాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.ఈ మూవీలోని పల్లెటూరు శ్రీకాంత్ రోల్‌కి నవీన్ పోలిశెట్టికి సైమా అవార్డులలో ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్నాడు. ఆ తరువాత మళ్ళీ రెండేళ్ళ తరువాత 2023లో అనుష్క శెట్టి హీరోయిన్ గా నవీన్ యాక్ట్ చేసిన మూవీ మిస్ శెట్టి.మిస్టర్ పోలిశెట్టి ఈ సినిమా కూడా మంచి విజయాన్ని తెచ్చిపెట్టింది.

Also Read: కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ ఓటీటీ డీల్ ఫిక్స్.. ఎందులో అంటే..?


ఇటు టాలీవుడ్‌ అటు బాలీవుడ్‌ పరిశ్రమలలో వరుసగా నాలుగైదు బ్లాక్ బస్టర్ మూవీస్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు పొలిశెట్టి.ఇక ఈ ఏడాదిలో ఒక్కటంటే ఒక్క మూవీ కూడా నవీన్ పొలిశెట్టి చేయలేదు. ఎందుకంటే నవీన్‌కి గట్టుకాలం స్టార్ట్ అయిందని చెప్పుకొచ్చారు.అంతేకాదు నవీన్ పోలిశెట్టికి ఫెయిల్యూర్ ఫోబియా స్టార్ట్ అయిందని తన సన్నిహితులు చెబుతున్నారు. తన కెరీర్‌లో ఏ మూవీ చేసినా సరే హిట్ కంపల్సరీ కొట్టాల్సిందేనని.. లేకుంటే సినీ కెరీర్‌కే నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అంతేకాదు ఆడియెన్స్‌ టేస్ట్‌కి తగ్గట్టుగా తన మూవీస్ ఉండాలని కోరుకుంటున్నట్లు కూడా చెబుతున్నారు. అంతేకాదు సక్సెస్ లేకపోవడంతో పొలిశెట్టికి సక్సెస్ భయం పట్టుకుందని అందుకే హైదరాబాద్‌లో లేకుండా అమెరికాలో ఉంటున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.అందుకే ఆ భయంతోనే ఏ మూవీ స్టోరీ విన్నా సరే ఓకే చెప్పకుండా డిసప్ఫాయింట్‌లో ఉన్నట్లు చెబుతున్నారు.ప్రస్తుతం పొలిశెట్టి హైదరాబాద్‌లో ఉండటం లేదు. అమెరికాలో సేద తీరుతున్నట్టు చెబుతున్నారు. అంతేకాదు అమెరికాలో పొలిశెట్టికి చిన్న యాక్సిడెంట్ అయినట్లు,ఆ కారణం చేతనే అమెరికాలో ఉంటున్నట్లు తన ఫ్రెండ్స్ చెబుతున్నారు. ఇక నవీన్ కామెడీ టైమింగ్‌ని జనాలందరు మిస్‌ అవుతున్నారని చాలామంది అభిప్రాయం.అంతేకాదు ఒక మూవీ విజయం వెనుక చాలా రీజన్స్‌ ఉంటాయి.అందులోనూ పొలిశెట్టి ఫెయిల్యూర్‌పై కాకుండా మూవీ ఎంపికపై ఫోకస్ పెట్టి తన నటనతో అభిమానులను ఆకట్టుకునే సినిమాలు చేయాలని నవీన్ అభిమానులు కోరుకుంటున్నారు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×