Mangal Gochar 2025: జూన్ నెల మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నెల ప్రారంభంలో కుజుడు సంచారం చేస్తాడు. ఇది 12 రాశులను ప్రభావితం చేస్తుంది. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం.. జూన్ 7, 2025న తెల్లవారుజామున 1:33 గంటలకు కుజుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రాశిలోనే జూలై 28, 2025 వరకు ఉంటారు. కుజుడు శక్తి, శౌర్యం, ధైర్యం, బలాన్ని సూచించే గ్రహం కాబట్టి ఈ మార్పు కొంతమంది జీవితాల్లో అనేక మార్పులు కలిగిస్తుంది. ముఖ్యంగా మేష, వృశ్చిక రాశి వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషరాశి:
సింహరాశిలో కుజుడు సంచరించడం వల్ల మీ యొక్క సమస్యలు పెరుగుతాయి. అంతే కాకుండా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంది. అందుకే ఇతరులతో ఎలాంటి వాదనలోకి దిగకుండా ఉండండి. ఆఫీసుల్లో మీ సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఏదైనా కొత్త పని, పెట్టుబడి లేదా ప్రయాణం కోసం కొంచెం వేచి ఉండటం మంచిది. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారు తమ కృషిని కొనసాగించాల్సి ఉంటుంది. ముఖ్యమైన పనులలో అజాగ్రత్తగా ఉండకండి. మీ ఖర్చులకు బడ్జెట్ తయారు చేసుకోవడం మంచిది. అంతే కాకుండా ఈ సమయంలో పెట్టుబడులు పెట్టకుండా ఉంటేనే మంచిది. ఈ సమయంలో ఉన్నతాధికారులతో మీరు జాగ్రత్తగా మాట్లాడండి. అంతే కాకుండా కుటుంబ సమస్యలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇతరులతో వ్యవహరించడం అలవాటు చేసుకోండి.
Also Read: సూర్యుడి సంచారం.. మే25 నుండి ఈ రాశుల వారు జాగ్రత్త !
వృశ్చిక రాశి:
ఈ రాశి వారికి కుజుడి సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. అంతే కాకుండా ఇది మీ పదవ ఇంట్లో, అంటే కెరీర్ స్థానంలో జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో.. మీరు మీ కెరీర్‌లో పురోగతిని, ఆశించిన ఫలితాలను పొందుతారు. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి శుభవార్త అందుతుంది. మీ మాటల్లో మృదుత్వం ప్రజల హృదయాలను గెలుచుకుంటుంది. ప్రత్యేక విషయం ఏమిటంటే.. వ్యాపారానికి సంబంధించిన ఒప్పందం కూడా కుజ గ్రహ ప్రభావం వల్ల విజయవంతం అవుతుంది. సంబంధాలలో మాధుర్యం, నమ్మకం, ప్రేమ పెరుగుతాయి. అంతే కాకుండా కుజ గ్రహ ప్రభావం వల్ల మనస్సులో శక్తి భావన ఉంటుంది. కొనసాగుతున్న ఆత్మవిశ్వాస లోపం తొలగిపోతుంది. వివాహితుల జీవితాల్లో కూడా ఆనందం వస్తుంది. మీ లక్ష్యాలను సాధించడంలో మీరు విజయం సాధిస్తారు. ఆకస్మిక ఆర్థిక లాభం పొందే అవకాశం కూడా ఉంది.