Viral Video: దేవుడా రోజు రోజుకి రీల్స్ పిచ్చి ముదిరి పాకానపడుతోంది.. ఫాస్ట్‌గా పాపులర్ అయ్యేందుకు ఎలాంటి పనులు చెయ్యడానికైనా వెనకాడట్లేదు. ఇటీవల కాలంలో రీల్స్ కోసం రకరకాల విన్యాసాలు చేయడం సర్వసాధారణం అయిపోయింది. రీల్స్ అప్డేట్ చేసి లైకులు కొట్టేయాలనన్న పిచ్చి యువతలో రోజు రోజుకి పెరుగిపోతోంది. సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో.. ఆ క్రేజ్‌ను ఉపయోగించుకుని ఓవర్ నైట్ స్టార్ కావాలని పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్ని చేస్తున్నారు.
అయితే తాజాగా ఒక లొకేషన్ కోసం ఇద్దరు అమ్మాయిలు నడిరోడ్డుపై పొట్టు పొట్టుకొట్టుకున్నారు. వాళ్లని అదుపు చేసేందుకు చాలా మంది ప్రయత్నం చేస్తున్నా కూడా.. ఒకరినొకరు జుట్టు పట్టుకుని కొట్టుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
యూపీలోని బరేలీలోగాంధీ ఉద్యాన్ సమీపంలో.. బాయ్ ఫ్రెండ్స్‌తో కలిసి అమ్మాయిలు రీల్స్ చేస్తున్నారు. కేవలం లొకేషన్ కోసం.. ఎక్కడైతే వాళ్లు రీల్స్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రదేశంలో వీరిద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకంది. నడిరోడ్డుపై ఒకరినొకరు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. అమ్మాయిలు అంటే కొంచెం అయిన ఆలోచించాల్సి ఉంటుంది. రోడ్డుపై ఇలా ప్రవర్తిస్తే.. మనల్ని ఎలా చూస్తారో అన్న ఆలోచన కూడా లేకుండా వీరిద్దరు కొట్టుకున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియోలో వైరల్‌గా మారాయి. అయితే ఎంత నచ్చజెప్పినా కూడా వాళ్లు వినకుండా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అమ్మాయిల తీరుపై అక్కడ స్థానికులు బిత్తరపోయిన పరిస్థితి నెలకొంది.
సాధారణంగా అమ్మాయిలు ఏదైనా డ్రెస్ కోసం.. లేకపోతే మనిషి కోసం గొడవపడుతూ ఉంటారు. ఇటీవల ఇద్దరు అమ్మాయిలు ఒక ఓ వ్యక్తి కోసం కొట్టుకోవడం జరిగింది. ఇంకా ఏదైనా విషయాల్లో కొట్టుకోవడం చూశాం కానీ.. ఒక లొకేషన్ కోసం అమ్మాయిలు గొడవపడటం.. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం యువతీ, యువకులు రీల్స్ పిచ్చి మోజులో పడి బరితెగించి ప్రవర్తిస్తున్నారు. బస్సుల్లో, మెట్రోలు, రైల్వే ట్రాక్‌లు, జనావాసాల్లో ఇష్టమొచ్చినట్లు రీల్స్ చేస్తు చుట్టు పక్కల వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అసలు.. వీళ్లు చేస్తున్న పనులు చూసి విసిగిపోయి తిట్టిపోస్తున్నారు. కొంత మంది ఎత్తైన జలపాతాలు, క్రూర జంతువుల దగ్గరకు వెళ్లి మరీ రీల్స్ చేస్తున్నారు.
Also Read: వెడ్డింగ్ వెన్యూకు మంటలు.. సంబరాలు చేసుకుంటున్న జనం.. ఎందుకలా?
అంతే కాకుండా.. తమ రీల్స్ వల్ల కొన్నిసార్లు వాళ్లు ఇబ్బందుల్లో పడటమే కాకుండా.. అవతలి వాళ్లను సైతం.. రిస్క్ లో పడేస్తున్నారు. ఇక తాజాగా ఇదే రీల్స్ పిచ్చి మోజులో పడి.. లోకేషన్ కోసం ఇద్దరు అమ్మాయిలు ఘోరంగా కొట్టుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. వారికి నచ్చజెప్పి గొడవను ఆపేశారు.