Greece Earthquake: ఆగ్నేయ ఐరోపా దేశం గ్రీస్ లో గురువారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.0 నమోదు అయింది. చుట్టు ప్రక్కల దేశాలు అయిన కైరో, ఇజ్రాయెల్, ఈజిప్టు, లెబనాన్, తుర్కియే జోర్డాన్ ప్రాంతాల్లోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా దీనిపై జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సస్.. భూ అంతర్భాగంలో 77 కిలో మీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో యూరోపియన్ అధికారులు సునామీ హెచ్చరిక జారీ చేసినట్లు ది ఇండిపెండెంట్ నివేదించింది. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అధికారులు అంతా అప్రమత్తం అయ్యారు.
గ్రీస్‌లోని క్రీట్ తీరానికి సమీపంలో గురువారం ఉదయం 8:49 గంటలకు (5:49 am GMT) ప్రకంపనలు సంభవించాయని US జియోలాజికల్ సర్వే తెలిపింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.0 నమోదు అయింది. ఫలితంగా ప్రజలంతా భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రాణాలు కాపాడుకునేందుకు గంటలపాటు రోడ్డుపై నిలబడ్డారు. అయితే భూకంపం వల్ల ఇప్పటి వరకు ఎంత మేర ఆస్థి, ప్రాణ నష్టం సంభవించిందో తెలియరాలేదు.
అయితే భూకంప స్థలానికి 100 కిలో మీటర్ల పరిధిలో.. స్థానిక స్థాయిలో భారీ అలలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 1000 కిలో మీటర్ల పరిధిలో ప్రాంతీయ శ్రేణిలో కూడా అలలు వస్తాయని వెల్లడించింది.
ఈ తరుణంలో అప్రమత్తమైన అధికారులు.. తీరప్రాంత ప్రదేశాల్లో అత్యవసర సహాయక చర్యలు చేపట్టారు. స్థానిక ప్రజలు అందరినీ భద్రతా కేంద్రాలకు తరలించారు. అలాగే భద్రతా కేంద్రాల వద్ద ప్రజలకు ఆహార, నీరు, వైద్య సహాయం తగిన ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా గ్రామీణ, పర్యాటకులు, చేపల వేట నౌకలు ఎక్కువగా ఉపయోగించే ప్రాంతాల్లో, హెచ్చరిక బోర్డులను పెట్టారు అధికారులు.
Also Read: మళ్లీ కరోనా.. ఆ నెలలోనే భూమి అంతం! వణుకు పుట్టిస్తున్న బాబా వంగా జోస్యం
ఇది మాత్రమే కాకుండా పపిఫిక్ అండ్ అట్లాంటిక్ టిస్మెయూ (PAA) వ్యవస్థలు సముద్ర అలలను అనుక్షణం పరీక్షిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతానికైతే ఎక్కడా భయంకర అలలు రాలేవని.. అయినప్పటికీ వచ్చే 72 గంటల పాటు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జాతీయ తీర భద్రతా శాఖ సూచించింది. గత నెల 13వ తేదీన 6.1 తీవ్రతతో గ్రీస్‌లో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. అప్పట్లో పెద్ద నష్టం జరగకపోయినప్పటికీ.. ప్రజలందరూ జాగ్రత్త ఉన్నారు.