Mangal Vakri 2025: అంగారకుడు జనవరి 21 మంగళవారం నుండి తిరోగమన దిశలో సంచరించనున్నాడు. కుజుడి ఈ రాశి మార్పు మిథునరాశిలో జరుగుతుంది. మిథున రాశికి అధిపతి బుధ గ్రహం. మిథున రాశిలో అంగారకుడి సంచారం 12 రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా 3 రాశుల వారికి ఇది అద్భుత ప్రయోజనాలను కలిగిస్తుంది. మరి కుజుడి తిరోగమనం ఏ ఏ రాశుల వారికి ఎక్కువ ప్రయోజనాలను కలిగిస్తుంది. ఆ రాశుల గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మిథున రాశి:
అంగారకుడి తిరోగమనం కారణంగా, మిథున రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అంతే కాకుండా మీరు మునుపటి కంటే ఆఫీసుల్లో మరింత త్వరగా పని చేయగలుగుతారు. కష్టపడి పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. రక్షణ రంగాలకు సంబంధించిన వ్యక్తులు సమాజంలో గొప్ప విజయాలు సాధించగలుగుతారు. అంతే కాకుండా వ్యాపారంలో వృద్ధి, కుటుంబంలో సానుకూల వాతావరణం కనిపిస్తుంది. విద్యార్థులు విద్యలో ఆశించిన ఫలితాలు సాధించగలుగుతారు. వ్యాపార లాభాలు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా సమయం గడపడానికి ఎక్కువ అవకాశాలు కూడా ఉన్నాయి. కొత్త ఆస్తి కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.
తులా రాశి:
అంగారకుడి తిరోగమన సంచారం తులా రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులను అధిగమించడంలో విజయం సాధిస్తారు. జీవితాల్లో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం కూడా చాలా వరకు తగ్గుతుంది. మీరు వ్యాపారంలో అద్భుత లాభాలను సంపాదించడంలో విజయం సాధిస్తారు. ఉద్యోగ మార్పు కావాలనుకుంటే, ప్రణాళిక విజయవంతం కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవితం మునుపటి కంటే మధురంగా ఉంటుంది. విద్యారంగంలో అనుకూల విజయాలు సాధిస్తారు. పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా తిసుకునే నిర్ణయాలు మీకు అనుకూల ఫలితాలు లభిస్తాయి. అంతే కాకుండా పెట్టుబడులు పెట్టే సమయంలో కుటుంబ సభ్యుల నిర్ణయాలను తెలుసుకోండి.
Also Read: గురుడి సంచారం.. ఫిబ్రవరి 4 నుండి వీరికి ఊహించని ధనలాభం
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వ్యక్తులు అంగారకుడి తిరోగమనం యొక్క శుభ ప్రభావం కారణంగా వారి సంపదను పెంచుకోవడంలో విజయం సాధిస్తారు. మీ వ్యాపారంలో మరిన్ని ఆదాయ మార్గాలు కలుగుతాయి. లక్ష్య సాధనకు కొత్త దారులు తెరుచుకుంటాయి. మీరు విద్యా రంగంలో కూడా గొప్ప విజయాన్ని సాధిస్తారు. మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తే జీవితం సులభం అవుతుంది. విద్యార్థులు చిన్న కోర్సుల ద్వారా గొప్ప విజయాలు సాధించవచ్చు. మీ ఆరోగ్యంలో ఆకస్మిక మెరుగుదల ఉంటుంది. కుటుంబ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిది. ఆఫీసుల్లో మీ పనికి అధికారుల నుండి ప్రశంసలు లభిస్తారు. మునుపటి కంటే మీరు మరింత ఉత్సాహంగా పనిచేయడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.