Indian Railways: సాధారణంగా రైల్వే ట్రాక్ ల నిర్వహణ సహా ఇతర పనుల కారణంగా రైళ్లు క్యాన్సిల్ అవుతుంటాయి. కొన్నిసార్లు రైలు ప్రమాదాల కారణంగానూ రైళ్లను రద్దు చేస్తుంటారు. కానీ, తాజాగా ఓ వందే భారత్ రైలును ఏకంగా 50 రోజుల పాటు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది నార్త్ రైల్వే సంస్థ. న్యూఢిల్లీ- శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా మధ్య నడిచే వందేభారత ఎక్స్ ప్రెస్ రైలును క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించింది.
న్యూఢిల్లీ- కత్రా నడుమ రెండు వందేభారత్ రైళ్లు
ప్రస్తుతం ఢిల్లీ- కత్రా మధ్య రెండు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. వీటిలో న్యూఢిల్లీ- శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా-న్యూఢిల్లీ వందే భారత్ ఎక్స్ ప్రెస్(రైలు నంబర్ 22439/22440 )కాగా, మరొకటి శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా- న్యూఢిల్లీ- శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా వందే భారత్ ఎక్స్ ప్రెస్(రైలు నంబర్ 22477/22478). వీటిలో న్యూ ఢిల్లీ- శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా- న్యూ ఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్(రైలు నంబర్ 22439/22440) సేవలను రద్దు చేస్తున్న రైల్వే అధికారులు తెలిపారు. న్యూ ఢిల్లీ- శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు 655 కి.మీ దూరాన్ని 8 గంటల 5 నిమిషాల్లో చేరుకుంటుంది.
ఈ రైలు ఏ రోజు నడుస్తుంది?
న్యూ ఢిల్లీ- శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు బుధవారం తప్ప మిగతా అన్ని రోజులలో నడుస్తుంది. ఈ రైలు న్యూఢిల్లీ నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.05 గంటలకు కత్రా రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో.. ఈ రైలు మధ్యాహ్నం 2.55 గంటలకు కత్రా నుంచి బయలుదేరి రాత్రి 11 గంటలకు దేశ రాజధానికి చేరుకుంటుంది.
రైలు ఎక్కడ ఆగుతుంది?
న్యూ ఢిల్లీ- శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా వందే భారత్ ఎక్స్ ప్రెస్ నాలుగు స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. వీటిలో అంబాలా కంటోన్మెంట్, లూథియానా జంక్షన్, పఠాన్ కోట్ కంటోన్మెంట్, జమ్మూ తావి ఉన్నాయి. ఈ రైల్లో రెండు రకాల సీట్లు ఉన్నాయి. వాటిలో ఒకటి AC చైర్ కార్ కాగా, మరొకటి ఎగ్జిక్యూటివ్ చైర్ కార్. AC చైర్ కార్ టికెట్ ధర రూ. 1,665 కాగా, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టికెట్ ధర రూ. 3055గా రైల్వే అధికారులు నిర్ణయించారు.
Read Also: ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఇకపై తేజస్, వందే భారత్ రైళ్లలోనూ ఆ సౌకర్యం!
ఎప్పటి నుంచి ఎప్పటి వరకు క్యాన్సిల్ అవుతుందంటే?
జమ్మూ రైల్వే స్టేషన్ రెన్నొవేషన్ తో పాటు నాన్- ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఈ రైలును రద్దు చేస్తున్నట్లు నార్త్ రైల్వే సంస్థ వెల్లడించింది. జనవరి 16 నుంచి మార్చి 6, 2025 వరకు రైలు సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది.
Read Also: నిమిషానికి 2.5 లక్షల టిక్కెట్ల జారీ, ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం!