Rahu Nakshatra Transit 2025: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నీడ గ్రహంగా పిలవబడే రాహువు జనవరి 12, 2025న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. రాహువు యొక్క ఈ రాశి మార్పు 12 రాశులను ప్రభావితం చేస్తుంది. రాహు సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా 4 రాశుల వారికి ఇది అద్భుత ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ రాశుల వారికి ఇది బంగారు సమయం అని చెప్పవచ్చు. అంతే కాకుండా ఈ సమయంలో వీరి బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే బలమైన అవకాశం ఉంటుంది. ఆ 4 అదృష్ట రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి:
రాహువు రాశి మార్పు కారణంగా మేష రాశి వారు వృత్తిలో పురోగతిని పొందుతారు. ఈ వ్యక్తుల ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఈ కాలంలో మీరు విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగస్తులకు పురోభివృద్ధి కోసం కొత్త అవకాశాలు లభిస్తాయి. మీరు పెట్టిన పెట్టుబడులు లాభాలను అందిస్తాయి. మీరు ఆకస్మిక ఆర్థిక లాభంతో సంతోషంగా ఉంటారు. వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. అంతే కాకుండా మీ కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు కూడా మెరుగుపడతాయి.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి రాహువు యొక్క రాశి మార్పు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది. అంతే కాకుండా కర్కాటక రాశికి చెందిన విద్యార్థులు విజయానికి బలమైన అవకాశాలు ఉన్నాయి. ఇదే కాకుండా మీ జీవనశైలిలో మార్పులు కనిపిస్తాయి. ఫలితంగా సమాజంలో మీకు గౌరవం కూడా పెరుగుతుంది. డబ్బు విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు పెట్టే పెట్టుబడులు ఈ సమయంలో మంచి లాభాలకు కారణం అవుతాయి.
సింహ రాశి:
ఉత్తరాభాద్రపద నక్షత్రంలో రాహువు ప్రవేశం సింహ రాశి వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. అంతే కాకుండా ఈ వ్యక్తులకు వ్యాపారంలో మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. వ్యాపారంలో పెద్ద ఒప్పందాన్ని పొందే బలమైన అవకాశం కూడా ఉంది. మీరు భాగస్వామ్య పనులలో విజయం సాధిస్తారు. మీ జీవిత భాగస్వామికి ప్రేమ సంబంధాలు బలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అంతే కాకుండా జనవరి 12 నుండి మీ ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. అంతే కాకుండా వైవాహిక సంబంధం సంతోషంగా ఉంటుంది. ఉన్నతాధికారులు ఆఫీసుల్లో మీ పనిని ప్రశంసిస్తారు.
Also Read: కొత్త ఏడాది వచ్చే ఫస్ట్ పండుగ సంక్రాంతి, ఆరోజు ఈ పనులు చేస్తే ఏడాదంతా ఆనందమే
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారు రాహువు మారడం వల్ల చాలా సంతోషంగా ఉంటారు.మీ వ్యాపారంలో ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి. జీవితంలో మానసిక ఒత్తిడి నుండి కూడా ఉపశమనం పొందుతారు. మీ కెరీర్ కొత్త మలుపులు తిరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది మంచి కాలం ప్రారంభం అవుతుంది.చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులను కూడా మీరు పూర్తి చేస్తారు. డబ్బు సంపాదన పెరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి. కొత్త, వాహనాలతో పాటు ఆస్తి కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు పెరుగుతుంది.