హిందూ ధర్మంలో మకర సంక్రాంతికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మకర సంక్రాంతి పండగ కోసం ఏడాదంతా ఎదురు చూస్తారు. ఎంతోమంది సంక్రాంతికి పల్లెటూర్లో కళకళలాడిపోతాయి. ఉద్యోగాల రీత్యా నగరాలకు చేరుకున్న వారంతా సంక్రాంతికి తమ సొంతూళ్లకు చేరుకుంటారు. భోగితో మొదలైన పండుగ ముగుస్తుంది. ఎంతైనా సంక్రాంతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మీ జీవితం అందంగా ఉండాలంటే సంక్రాంతి రోజు కచ్చితంగా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి.
జనవరి నెల కొత్త సంవత్సరం ప్రారంభం మాత్రమే కాకుండా అద్భుతమైన పండగలకు కూడా నెలవైంది. హిందువులు చేసుకునే పెద్ద పండుగ… మూడు రోజుల పండుగ అయిన మకర సంక్రాంతి జనవరి నెలలోనే వస్తుంది. మకర సంక్రాంతికి సూర్యుడు, ధనస్సు నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనికి మతపరమైన ఆధ్యాత్మిక కోణం కూడా ఉంది. అలాగే మకర సంక్రాంతికి భీష్మ పితామహుడుని కూడా ఒకసారి తలుచుకుంటారంతా.
భీష్మ పితామహుడి కథ
మకర సంక్రాంతికి మహాభారత కథకు అనుబంధం ఉంది. భీష్మ పితామహుడు తన మరణాన్ని తాను ఎంచుకుని ముక్తిని పొందాడు. అంటే తాను ఎప్పుడూ అనుకుంటే అప్పుడే ప్రాణాన్ని విడిచి పెట్టవచ్చు. కురుక్షేత్ర యుద్ధంలో నేలకొరిగిన భీష్మ పితామహుడు సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే వరకు ప్రాణాన్ని నిలిపి ఉంచుకున్నాడు. ఉత్తరాయణంలోనే ముక్తిని పొందాలని ఆయన నిర్ణయించుకున్నాడు. అంతవరకు వేచి ఉండి సూర్యుడు ఉత్తరాయణంలోకి వెళ్ళగానే తన ప్రాణాన్ని విడిచాడు. ఉత్తరాయణంలో మరణించిన వారికి జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతారని ఎన్నో గ్రంథాలలో ఉంది. అదే దక్షిణాయంలో మరణిస్తే పునర్జన్మ ఉంటుందని చెప్పుకుంటారు. అందుకే ఉత్తరాయణంలోనే మరణించాలని భీష్మ పితామహుడు ఎంతోసేపు వేచి ఉన్నాడు.
దానాలు చేయాల్సిన కాలం
ఉత్తరాయణ కాలం అనేది ఎంతో ప్రాముఖ్యత కలిగినది. సూర్యుడు మకర రాశిని దాటి ఉత్తర కర్కాటక రాశి వైపు వెళ్ళినప్పుడు దానిని ఉత్తరాయణం అంటారు. ఇది ఎక్కువ పగటిని, తక్కువ రాత్రి కాలాన్ని సూచిస్తుంది. వైదిక సాంప్రదాయాల ప్రకారం ఉత్తరాయణంలోకి సూర్యుడు ప్రవేశిస్తే దాన్ని దేవతల రోజుగా చెప్పుకుంటారు. దక్షిణాయణాన్ని దేవతల రాత్రిగా పరిగణిస్తారు. దీన్నే దేవయాన్, పిత్రియాన్ అని పిలుస్తారు. ఉత్తరాయన సమయం శుభకార్యాలకు అనువైనది. ఈ కాలంలోనే దానాలు వంటివి చేయాలి. అవి ఎక్కువ ఫలితాలు ఇస్తాయి.
మకర సంక్రాంతి నాడు కచ్చితంగా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ఈ రోజున పవిత్ర నదులలో స్నానం చేస్తే ఎంతో మంచిది. ఇది సాధ్యం కాకపోతే ఇంట్లో స్నానం చేసే నీటిలో కొన్ని నువ్వులను వేసుకొని స్నానం చేయండి. అలాగే రాగి పాత్రలో నీటిని తీసుకొని దానిలో ఎర్రటి పువ్వులు, నువ్వులు వేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. ఈరోజు నువ్వులు, బెల్లం కలిపి దానం చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది.
దానం మీ జీవితంలో ఉన్న చేదును కూడా తీపిగా మార్చేస్తుంది. అలాగే బెల్,లం నువ్వులు కలిపి తినడం వల్ల కూడా ఎంతో ఉపయోగం ఉంది. సూర్య భగవానుడికి నువ్వులు బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పించి పూజ చేస్తే ఎంతో మంచిది. ఆ పూజ సమయంలో ఓం సూర్యాయ నమః, ఓం నమో భగవతే సూర్య అనే మంత్రాన్ని జపించాలి. అవసరమైన వారికి ఆహారం, బట్టలు, డబ్బులు వంటివి దానం చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.