Shani Gochar 2025: న్యాయ దేవుడు శని తన స్వంత రాశి అయిన కుంభ రాశి నుండి మీన రాశికి 29 మార్చి 2025న ప్రవేశించనున్నాడు. ఈ రోజున పాక్షిక సూర్యగ్రహణం కూడా ఉంటుంది. అందుకే ఇదే రోజు శని సంచారం, సూర్య గ్రహణం ఒకే రోజు జరగడం వల్ల 12 రాశుల వారిపై ప్రభావం ఉంటుంది.
జ్యోతిషశాస్త్రం ప్రకారం శని అత్యంత ప్రభావవంతమైన గ్రహాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. శనిని కర్మ గ్రహంగా పరిగణిస్తారు. జ్యోతిషశాస్త్రంలో శని సంచారానికి ,సూర్య గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. న్యాయాన్ని అందించే శని తన స్వంత రాశి అయిన కుంభ రాశి నుండి మీన రాశికి 29 మార్చి 2025న మారనున్నాడు. ఈ రోజున పాక్షిక సూర్యగ్రహణం కూడా ఉంటుంది. శనిగ్రహం యొక్క రాశి మార్పు, సూర్యగ్రహణం కలయిక అనేక 12 రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా 3 రాశుల వారికి లాభాలను కలిగిస్తుంది. మరి ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
మిథున రాశి:
సూర్యగ్రహణం, శని సంచార కలయిక మిథున రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ కలయిక వల్ల మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. అంతే కాకుండా మీరు పాత పెట్టుబడుల నుండి మంచి లాభాలను పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. శని సంచారం , సూర్యగ్రహణం సమయంలో వ్యాపారవేత్తలు డబ్బు సంపాదించడానికి ఆకస్మిక అవకాశాలను పొందుతారు. ఉద్యోగస్తులకు ఆశించిన పదోన్నతులు లభించే అవకాశం ఉంది. కార్యాలయంలో మీ పనిని ప్రశంసిస్తారు. అధికారుల నుండి మీరు మద్దతు లభిస్తుంది.
ధనస్సు రాశి:
ఒకే రోజు వచ్చే శని సంచారం, సూర్యగ్రహణం మీకు అదృష్ట సమయాన్ని సృష్టిస్తుంది. మీ పెండింగ్ పనులను పూర్తి చేయడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు వ్యాపారవేత్త అయితే మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి సమయం. మీరు కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం పొందుతారు. మీరు మీ భాగస్వామి లేదా జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు.ఇది మీ సంబంధాన్ని స్థిరంగా ఉంచుతుంది. మీరు రాబోయే సమస్యలను చక్కగా ఎదుర్కోగలుగుతారు. కుటుంబ సభ్యులతో మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆస్థి, వాహనాలను కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.
Also Read: పంచమహాయోగం.. 5 రాశుల వారి జీవితాల్లో అద్భుతాలు
మకర రాశి:
సూర్యగ్రహణం , శని సంచారం మకర రాశి వారికి చాలా శుభప్రదం కానుంది. ఈ కాలంలో మీ ఆస్తి సంబంధిత వివాదాలు పరిష్కరించబడతాయి. అంతే కాకుండా మీరు పాత పెట్టుబడుల నుండి మంచి రాబడిని పొందుతారు. ఆఫీసుల్లో కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా ఉన్న మీ ఆర్థిక సమస్యలు తీరుతాయి. సమాజంలో మీ హోదా పెరుగుతుంది. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి శుభవార్త అందుతుంది. విద్యార్థులకు ఇది మంచి సమయం. ఉన్నత ఉద్యోగాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా కుటుంబ సభ్యుల మద్దతు మీకు ఉంటుంది. వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది.