Chandra Gochar 2025 : జాతకంలో ఏకకాలంలో ఐదు మహాయోగాలు ఏర్పడటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. చంద్రుడు శనివారం 18 జనవరి 2025 కన్యారాశిలోకి ప్రవేశించాడు. దీంతో పాటు మాఘ మాస కృష్ణ పక్షం ఐదవ తేదీ కూడా చంద్రుడు రాశి మారనున్నాడు.శనివారము శశ రాజ్యయోగము, గజకేసరి యోగము, శోభనయోగములతో పాటు పూర్వ ఫాల్గుణి, ఉత్తర ఫాల్గుణి నక్షత్రములు ఏర్పడనున్నాయి. ఒక రోజులో ఐదు యోగాలు రావడంతో మహాయోగం ఏర్పడింది. విశేషమేమిటంటే, చంద్రునిపై దేవగురువు బృహస్పతి ఐదవ అంశం కారణంగా, దాని ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఈ గొప్ప సంయోగం అన్ని రాశుల వారిని ప్రభావితం చేసినప్పటికీ కొన్ని రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది. మరి ఆ అదృష్ట రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మిథున రాశి:
ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు ఆఫీసుల్లో ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. అధికారులు, సహోద్యోగుల నుండి కూడా మీకు మద్దతు లభిస్తుంది. కుటుంబ సమేతంగా వనభోజనాలు మొదలైనవి చేసే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు విజయం సాధిస్తారు. అంతే కాకుండా మీ పెట్టుబడి ద్వారా లాభం టుంది.ఉం
సింహ రాశి :
ఈ రాశి వారికి గౌరవం పెరిగే అవకాశాలు ఉన్నాయి. సామాజిక రంగంలో పనిచేసే వ్యక్తులకు ప్రశంసలు లభిస్తాయి. రాజకీయాల్లో చురుగ్గా ఉండే వ్యక్తులకు పెద్ద బాధ్యతలు రావచ్చు. వ్యాపారంలో ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. సమయం అనుకూలంగా ఉంది. దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. విద్యార్థులకు కూడా ఇది మంచి సమయం. ఆర్థిక లాభాలు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అంతే కాకుండా మీరు ఆస్థితో పాటు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
తులారాశి:
మీకు గతంలో అడ్డంకిగా ఉన్న అనేక పనులు పూర్తి అవుతాయి.అంతే కాకుండా వివాహం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులు వైవాహిక సంబంధాలలో విజయం పొందుతారు. మీకు దగ్గరగా ఉన్న వారి నుండి గతంలో ఇచ్చిన డబ్బులు పొందుతార.ఆస్తి సంబంధిత పనులలో లాభాలు వచ్చే అవకాశం ఉంది.
మకర రాశి:
ఈ రాశి వారికి రియల్ ఎస్టేట్‌లో డబ్బు పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం. పని ప్రదేశంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకు పెద్ద బాధ్యతలు రావచ్చు. భవిష్యత్తులో పదోన్నతి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఆకస్మిక ఆర్థిక లాభం కారణంగా, మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు కూడా ఉన్నాయి.
Also Read: సూర్యుడి నక్షత్ర మార్పు.. వీరు పట్టిందల్లా బంగారం
మీన రాశి:
మీనరాశి వారు ఏ పని చేసినా అనుకున్నదానికంటే ఎక్కువ విజయాన్ని, లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్లడానికి లేదా వీసా పొందడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులు కూడా విజయం పొందుతారు. అదనపు ఖర్చులు ఉంటాయి. ధార్మిక ప్రదేశాన్ని సందర్శించే అవకాశం ఉంది. మీరు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నట్లయితే పూర్తిగా ఆరోగ్యం నయం అవుతుంది.