BigTV English

Tollywood IT Raids : పేరు కోసం చేశారు… ఇప్పుడు ఎదుర్కొంటున్నారు

Tollywood IT Raids : పేరు కోసం చేశారు… ఇప్పుడు ఎదుర్కొంటున్నారు

Tollywood IT Raids : తెలుగులో ఓ సామెత ఉంటుంది. “తాము కూర్చున కొమ్మను తామే నరుక్కోవడం” ఇప్పుడు ఇలానే ఉంది కొంత మంది టాలీవుడ్ నిర్మాతల పరిస్థితి. ఈ రోజు తెల్లవారు జామున నుంచి టాలీవుడ్‌లో 200కు పైగా ఐటీ అధికారులు ప్రముఖ నిర్మాతల నివాసలు, అఫీస్‌లపై రైడ్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో నిర్మాతలపై, నిర్మాతల ఆఫీస్‌లపై ఐటీ రైడ్స్ జరగడం ఇదేం కొత్త కాదు. అయితే ఈ టైంలో ఐటీ రైడ్స్ జరగడంపై కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. అవి ఏంటో ఇప్పుడు క్లీయర్‌గా చూద్ధాం…


ఈ రోజు తెల్లవారు జామున నుంచి హైదరాబాద్ నగరంలో ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. తెలుగు ఇండస్ట్రీలో టాప్‌గా కొనసాగుతున్న నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC), మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు మ్యాంగో మీడియాపైన కూడా ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. దాదాపు 200 మంది ఐటీ అధికారులు ఈ రైడ్స్‌లో పాల్గొంటున్నట్టు సమాచారం. ఒక మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీస్‌కే 5 వాహనాల్లో ఐటీ అధికారులు వచ్చినట్టు తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ సీఈవో ఇంటికి కూడా అధికారులు చేరుకున్నారట. అలాగే దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌తో పాటు ఆయన రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన దిల్ రాజు కన్‌స్ట్రక్షన్ లిమిటెడ్‌లోనూ ఐటీ అధికారలు సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం.

అయితే ఇప్పుడు ఈ రెండు నిర్మాణ సంస్థలపైనే ఇప్పుడు ఎందుకు రైడ్స్ జరుగుతున్నాయనే చర్చ జరుగుతుంది. ఇప్పుడు రైడ్స్ ఎందుకు అనే క్వశ్చన్ వచ్చినవెంటనే వచ్చే ఆన్సర్… ఆ రెండు బ్యానర్స్ నుంచి ఇటీవల మూడు భారీ సినిమాలు. వాటి వల్లే నేడు ఈ రైడ్స్ అని అంటున్నారు.


మైత్రీ మూవీ మేకర్స్ విషయానికి వస్తే… ఈ బ్యానర్ నుంచి గతేడాది డిసెంబర్‌లో పుష్ప 2 మూవీ వచ్చింది. ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ల గురించి ప్రతీ రోజు పోస్టర్స్ వేస్తూ… ప్రచారం చేసుకున్నారు. చివరగా 1831 కోట్లు వచ్చాయని పోస్టర్ వదిలారు. 2000 కోట్లను కలెక్ట్ చేయడమే తమ లక్ష్యం అన్నట్టు మేకర్స్ బహిరంగంగానే చెప్పుకున్నారు. అలాగే రిలీజ్ కు ముందే 1000 కోట్ల బిజినెస్ అయింది అంటూ స్వయంగా సినిమా ఈవెంట్స్ పైనే అఫిషియల్ గా మాట్లాడారు.

ఇక దిల్ రాజు విషయానికి వస్తే… ఈ ఏడాది సంక్రాంతి మొత్తం దిల్ రాజుదే. ఆయన సొంత బ్యానర్‌లో గేమ్ ఛేంజర్ అనే భారీ మూవీతో పాటు సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ కూడా వచ్చింది. వీటితో పాటు డాకు మహారాజ్ మూవీ నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కూడా దిల్ రాజు దగ్గరే ఉన్నాయి. కాగా, ఇందులో గేమ్ ఛేంజర్ మూవీకి దాదాపు 450 కోట్లు ఖర్చు పెట్టినట్టు స్వయంగా దిల్ రాజు ప్రకటించాడు. అలాగే సంక్రాంతికి వస్తున్నాం మూవీ కలెక్షన్ల పరంగా దుమ్ములేపుతుందని, అల్లు అర్జున్ రికార్డ్స్ ను కూడా బ్రేక్ చేసింది అంటూ, 161 కోట్ల కలెక్షన్లు వచ్చాయి అంటూ ప్రచారం చేసుకున్నాడు.

వీటి అన్నింటి నేపథ్యంలో అటు మైత్రీ మూవీ మేకర్స్, ఇటు దిల్ రాజు ఐటీ దృష్టిలో పడ్డారు అని చెప్పొచ్చు. ఈ రోజు జరుగుతున్న ఐటీ దాడులకు కూడా ప్రధాన కారణమిదే అని కూడా అనుకోవచ్చు.

నిజానికి సినిమాకు వచ్చే కలెక్షన్ల గురించి మాట్లాడితే… ప్రొడ్యూసర్ నాగ వంశీ ఓ సందర్భంలో “సినిమాకు వచ్చే కలెక్షన్ల గురించి ఎవ్వరికీ క్లారిటీగా తెలీదు. నిర్మాతలు ఆ నెంబర్స్‌ను బయట పెట్టడానికి ఇష్టపడరు. హీరో ఫ్యాన్స్ కోసం మాత్రమే నిర్మాతలు కలెక్షన్ల పోస్టర్లను వదులుతారు” అని చెప్పుకొచ్చారు

ఇప్పుడు ఈ రెండు బ్యానర్స్ రిలీజ్ చేస్తున్న కలెక్షన్ల పోస్టర్ల వెనక ఎలాంటి కథ ఉందో అందరికీ తెలుసు. పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత అల్లు అర్జున్ ఎలాాంటి టార్గెట్ పెట్టుకున్నారో కూడా ఇండస్ట్రీలో చాలా మాటలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

అలాగే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో గేమ్ ఛేంజర్ రావడం దానిపై డిజాస్టర్ టాక్ రావడం, దాని తర్వాత వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం, దానికి సంబంధించిన పోస్టర్లు రావడం కూడా అందరు చూశారు.

వీటి అన్నింటి తర్వాత… పేరు కోసం, హీరో కోసం, హీరో ఫ్యాన్స్ కోసం, సినిమా ప్రచారం కోసం ఇలా చేశారు కాబట్టే… ఇప్పుడు ఐటీ రైడ్స్ ను ఎదుర్కొంటున్నారు అని ఇండస్ట్రీలో కామెంట్స్ వస్తునాయి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×