Makar Sankranti 2025: మకర సంక్రాంతి పండుగను భారతదేశం అంతటా 14 జనవరి 2025న జరుపుకోనున్నాము. సనాతన ధర్మంలో మకర సంక్రాంతి పండగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గ్రహాలకు రాజు అయిన సూర్యుడు ధనస్సు రాశిని వదిలి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతిని జరుపుకుంటారు. ఈ రోజున సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి మారతాడు. ఇంత ప్రాముఖ్యత ఉన్నఈ రోజున అనేక శుభ యోగాలు ఏర్పడనున్నాయి. అంతే కాకుండా ఈ రోజు ధానం చేస్తే చాలా మంచిదని కూడా భావిస్తారు. దానం చేసే వారి ఇళ్లు, ఆనందంతో పాటు శ్రేయస్సును పొందుతుందనిచెబుతారు.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీతో సహా అనేక రాష్ట్రాల్లో దీనిని మకర సంక్రాంతి మరియు ఖిచ్డీ పండుగగా జరుపుకుంటారు. తమిళనాడులో ఈ పండుగను పొంగల్ పేరుతో జరుపుకుంటారు. ఈ రోజున, కొత్త వరి పంట నుండి బియ్యం వండుతారు. ఇది తమిళనాడులో నాలుగు రోజుల పండుగ.
పంజాబ్‌తో పాటు హర్యానా రాష్ట్రంలో మకర సంక్రాంతి పండుగను లోహ్రీ పండుగగా జరుపుకుంటారు. ఈ రోజు నుంచి పంట కోసే పని మొదలవుతుంది. మహారాష్ట్రలో ఈ పండుగను తిల్గుల్ పేరుతో జరుపుకుంటారు.
సూర్యుడు ధనస్సు నుండి మకరరాశికి సంక్రమించే జనవరి 14, 2025న మకర సంక్రాంతి పర్వదినాన ఏకకాలంలో అనేక యోగాలు ఏర్పడనున్నాయి. జ్యోతిష్య పరంగా చూస్తే, విష్కుంభ యోగం, పునర్వసు నక్షత్రాల సహకారం ఏర్పడుతోంది. అలాగే మిథునరాశిలో దేవగురువు బృహస్పతి, శుక్రుడు కలయిక వల్ల గజ లక్ష్మీ యోగం ఏర్పడుతోంది. మకర సంక్రాంతి పండుగ రోజున ఉదయం 10:18 గంటల నుండి పునర్వసు తర్వాత పుష్య నక్షత్రం కనిపిస్తుంది. ఋగ్వేదంలో, పుష్య నక్షత్రం చాలా పవిత్రమైనది. ఇది ఆనందంతో పాటు శ్రేయస్సును కలిగిస్తుంది.
ఈ పరిహారం చేయండి :
వీలైతే, మొత్తం 12 రాశుల వారు ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత నువ్వులు, బెల్లం, వరి, కిచడీ, దేశీ నెయ్యి, ఉప్పు మొదలైన వాటిని దానం చేయడం మంచిది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జనవరి 13 వ తేదీ మధ్యాహ్నం 1.40 కి సూర్యుడు , అంగారక గ్రహాలు ఒకదానికొకటి 120 డిగ్రీల దూరంలో ఉంటాయి. దీని వల్ల నవపంచమ యోగం ఏర్పడనుంది. ఈ రాజయోగం మొత్తం 12 రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. అంతే కాకుండా ముఖ్యంగా 3 రాశుల వారికి ఇది అద్భుతమైన ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ రాశుల వ్యక్తులు కూడా ఈ సమయంలో ఊహించని ధనలాభాన్ని పొందనున్నారు. మరి నవపంచమ రాజయోగం వల్ల ఏ ఏ రాశుల వారు ప్రయోజనం పొందనున్నారనే విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వృశ్చిక రాశి:
మకర సంక్రాంతికి ముందు ఏర్పడే నవపంచం రాజ్యయోగం వృశ్చిక రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. మీ ఆఫీసుల్లో మీరు చేసిన కష్టానికి పూర్తి ఫలితాలు పొందుతారు. మీరు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా సూర్యుడి అనుగ్రహంతో మీ ఆర్థిక పరిస్థితిలో కూడా గొప్ప మెరుగుదల ఉంటుంది.
తులా రాశి:
తులా రాశి వారికి నవపంచం రాజయోగం వల్ల చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తి చేస్తారు. అంతే కాకుండా మీ కుటుంబాల్లో శుభ కార్యాలు ప్రారంభమవుతాయి. ప్రయాణాల ద్వారా డబ్బు సంపాదించడంలో విజయం సాధిస్తారు. ప్రేమ జీవితంలో మాధుర్యం ఉంటుంది. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.
Also Read: మకర సంక్రాంతి శుభ సమయం, మతపరమైన ప్రాముఖ్యత
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారు నవపంచమ రాజయోగ ప్రభావం వల్ల రాజభోగాలు పొందుతారు. ఈ సమయం నుండి మీకు అంతా అనుకూలంగానే ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆఫీసుల్లో కొత్త బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీరు సంతోషంగా ఉంటారు. మీరు భాగస్వామ్యంతో విజయవంతమైన వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు కూడా ఎక్కవగా ఉన్నాయి.