Makar Sankranti 2025:సనాతన ధర్మంలో మకర సంక్రాంతి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగ సూర్య భగవానుడికి సంబంధించినది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య భగవానుడు సంవత్సరంలో 12 నెలలలో 12 వేర్వేరు రాశులలో సంచరిస్తాడు. సూర్యుడు ధనుస్సును విడిచిపెట్టి మకరరాశికి వచ్చినప్పుడు మకర సంక్రాంతి జరుపుకుంటారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి రోజున పవిత్ర నదులలో స్నానం చేయడం విశేష ఫలితాలలు లభిస్తాయని నమ్ముతారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన వెంటనే వచ్చే 6 నెలలకు ఉత్తరాయణం అవుతుంది. దీంతో ఖర్మాలు ముగిసి కుటుంబాల్లో శుభకార్యాలు ప్రారంభమవుతాయి. మరి ఈ ఏడు మకర సంక్రాంతి ఎప్పుడు. దీని శుభ సమయం ఏమిటి అంతే కాకుండా పండగ యొక్క మతపరమైన ప్రాముఖ్యత గురించిన పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వేద క్యాలెండర్ ప్రకారం సూర్యుడు జనవరి 14 ఉదయం 8:41 గంటలకు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే ఈసారి మకర సంక్రాంతిని జనవరి 14న మాత్రమే జరుపుకోనున్నాము. ఈసారి మకర సంక్రాంతి నాడు ఉదయం 9:03 నుండి రాత్రి 10:48 వరకు స్నానము, దానము చేయుటకు శుభముహూర్తం.
ఇంట్లో ఉన్న వారు ఇలా చేయండి:
పండితుల ప్రకారం మకర సంక్రాంతి రోజున ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, కురుక్షేత్ర, బ్రహ్మసరోవరం వంటి పవిత్ర స్థలాలను సందర్శించడంతో పాటు నదులలో స్నానం చేయడం ద్వారా మనిషి అన్ని దోషాల నుండి విముక్తి పొందుతాడు. సంక్రాంతి రోజు మీరు అక్కడికి వెళ్లలేకపోతే, ఇంట్లోనే ఒక బకెట్ నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకుని స్నానం చేయండి. దీనివల్ల నదీ స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది.దీని తరువాత నువ్వులు, వేరుశెనగలు, ధాన్యాలు, బెల్లం వంటి వాటిని అవసరమైన వారికి దానం చేయండి. వెచ్చని బట్టలు కూడా దానం చేయవచ్చు.సంక్రాంతి రోజు ధానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.