CM Revanth Reddy: మాజీ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్‌రావు స్వీయ చరిత్ర రాసుకున్నారు. ఉనిక పేరుతో పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఆ పుస్తకావిష్కరణకు ముఖ్యఅతిథిగా సీఎం రేవం త్‌రెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్ లోని తాజ్ కృష్ణాలో నిర్వహించిన కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఒడిశా గవర్నర్ కే. హరిబాబు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తో కలిసి రేవంత్ రెడ్డి పుస్తకావిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఉనిక పుస్తకావిష్కరణకు హాజరై.. ఒకే వేదికపైన పెద్దలందరిని కలవడం ఆనందంగా ఉందన్నారు. విద్యాసాగర్ రావుని తామంతా.. సాగర్ జీ అని పిలుచుకుంటామని సీఎం అన్నారు. ఆదర్శభావాలు ఉన్న వ్యక్తి.. తన స్వీయ చరిత్ర రాసుకోవడం భావి తరాలకు ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు. తమిళనాడు, మహారాష్ట్రాలకు ఒకేసారి గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించారంటే.. ఆయన సామర్ధ్యం ఏంటో ప్రదానీ మోదీ కూడా గుర్తించారన్నారు.
తెలంగాణ ఖ్యాతిని పెంచి తాను నమ్మిన సిద్ధాంతాల కోసం నిలబడిన వ్యక్తి విద్యాసాగర్ రావు అని పేర్కొన్నారు. పాలక పక్షం కలిస్తేనే ప్రభుత్వం అని తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తాము ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి భహిష్కరించలేదని.. గత 13 నెలల కాలంలో ఇదే చూస్తున్నానని సీఎం అన్నారు. విద్యాసాగర్ రావు మొదలు పెట్టిన గోదావరి జలాల వినియోగం ఆలోచన సంపూర్ణంగా పూర్తి కాలేదన్నారు. మహారాష్ట్రలో ముంపునకు గురవుతున్న భూమిని మనకు ఇప్పిస్తే.. తక్కువ ఖర్చుతో గోదావరి జలాలను వినియోగించుకోవచ్చని ఈ సందర్బంగా తెలియజేశారు.
Also Read: జీహెచ్‌ఎంసీ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక సమావేశం
అందుకు విద్యాసాగర్ రావు అనుభవం మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ విషయంలో మహారాష్ట్ర సీఎంతో విద్యాసాగర్ రావు చొరవ తీసుకోవాలని సీఎం రేవంత్ సూచించారు. రీజనల్ రింగ్ రోడ్డుతో మాత్రమే కాకుండా రీజనల్ రింగ్ లైన్ గురించి కూడా తాము ప్రధాని మోదీతో చర్చించామన్నారు. ఇక ఆటో ముబైల్ ఇండస్ట్రీని తెలంగాణకు తీసుకురావాలని అనుకుంటున్నామన్నారు. దీంతోపాటు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పనులు అన్నీ వేగవంతం చేయాలని మోదీని కోరినట్లుగా సీఎం పేర్కొన్నారు.