BigTV English

Venkatesh: సింగర్ తో కలిసి స్టెప్పులతో దుమ్ము దులిపేసిన వెంకీ.. ఈ యాంగిల్ ఎప్పుడూ చూడలేదుగా..!

Venkatesh: సింగర్ తో కలిసి స్టెప్పులతో దుమ్ము దులిపేసిన వెంకీ.. ఈ యాంగిల్ ఎప్పుడూ చూడలేదుగా..!

Venkatesh.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు విక్టరీ వెంకటేష్ (Venkatesh). తన అద్భుతమైన నటనతో అటు లేడీ ఫ్యాన్స్ లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇకపోతే చివరిగా తన 75వ చిత్రంగా వచ్చిన ‘సైంధవ్’ సినిమాతో డిజాస్టర్ ను చవిచూసిన వెంకటేష్, ఇప్పుడు ఎలాగైనా సరే భారీ సక్సెస్ అందుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి సినిమా చేస్తున్నారు.అదే ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఇప్పటికే సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని, జనవరి 14వ తేదీన విడుదలకు సిద్ధం కాబోతోంది.


సింగర్ మధుప్రియ తో అద్భుతమైన డాన్స్ చేసిన వెంకటేష్..

ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్ జోరుగా చేపట్టారు చిత్ర బృందం. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి భిన్నంగా బ్లాక్ బాస్టర్ మ్యూజికల్ నైట్ పేరుతో చిత్ర బృందం ఒక ఈవెంట్ నిర్వహించింది. ఈ సందర్భంగా వెంకటేష్ గతంలో నటించిన సినిమా పాటలు కూడా పాడి వినిపించారు ప్రముఖ సింగర్లు. అందులో భాగంగానే వెంకటేష్ ఈవెంట్ కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వెంకటేశు.. అంటూ సాగే ఒక పాట సింగర్ మధుప్రియ(Madhupriya) చాలా అద్భుతంగా పాడింది. ఇక ఈ పాట పాడుతున్న సమయంలో వెంకటేష్ వచ్చి తనకు కేటాయించిన స్థానంలో కూర్చున్నారు. మధుప్రియ పాట పాడుతూ కిందకు వచ్చి వెంకటేష్ ని తనతో డాన్స్ చేయమని కోరింది. సాధారణంగా ఎవరైనా స్టార్ హీరోలు ఇలా డాన్స్ చేయమని అడిగితే, సైలెంట్ గా ఉండిపోతారు. కానీ వెంకటేష్ మాత్రం చాలా యాక్టివ్ గా.. ఆమె పాడే పాటకు డాన్స్ చేయడమే కాకుండా తన అభిమానులందరినీ అలరించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా ఇది చూసిన ఆడియన్స్ వెంకటేష్ అందరికంటే భిన్నం అనడానికి ఇదే నిదర్శనం అంటూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.


సంక్రాంతికి వస్తున్నాం మూవీ విశేషాలు..

వెంకటేష్ హీరోగా, ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’.. సంక్రాంతి రేసులో నిలిచిన ఈ సినిమా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఇందులో ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి(Meenakshi Choudhary) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ‘గోదారి గట్టుమీద’ అనే పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు అత్యధిక వ్యూస్ సాధించిన పాటగా కూడా రికార్డు క్రియేట్ చేసుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ అన్నీ కూడా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక పాటలకు వచ్చిన రెస్పాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రమణ గోగుల పాడిన పాటలు మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బాస్టర్ అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×