Bhayam Bhayam Song: తాజాగా జరిగిన పహల్గమ్ అటాక్ గురించే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇండియాలో ఎన్నో టూరిస్ట్ ప్రాంతాలు ఉన్నాయి. సమ్మర్ రాగానే చాలామంది వీటిలో ఏదో ఒక ప్రాంతానికి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కశ్మీర్‌కు వెళ్లడానికి ఎంతోమంది ఎదురుచూస్తూ ఉంటారు. అలాగే 2025 సమ్మర్ కూడా కశ్మీర్‌కు వెళ్లడానికి మంచి సమయం అనుకున్న వారంతా ఒక్కచోట చేరారు. పాకిస్థాన్ తీవ్రవాదులు అదే మంచి సందర్భం అనుకొని వారిపై అటాక్ మొదలుపెట్టారు. ఆ అటాక్‌లో చనిపోయిన వారి కుటుంబాలు ఎంత బాధపడుతున్నాయో చెప్తూ బిగ్ టీవీ ఒక పాట సిద్ధం చేసింది. అది చూస్తుంటే గుండెలు బరువెక్కడం ఖాయం అనిపిస్తుంది.
భయం.. భయం..
ఏఐ సాయంతో అసలు పహల్గమ్ అటాక్ ఎలా జరిగుంటుందో చూపించింది బిగ్ టీవీ. ఈరోజుల్లో అసలు బ్రతకడానికి మనుషులు ఎంతలా భయపడాల్సి వస్తుంది, మతం ముసుగులో మనిషి ఎంత కసాయిగా మారుతున్నాడు అని చెప్పే లిరిక్స్ ఆలోచింపేలా చేస్తున్నాయి. ‘ప్రతీక్షణం భయం భయం’ అంటూ సాగే ఈ పాట ఇప్పటికే చాలామంది ప్రేక్షకులకు రీచ్ అవ్వడంతో పాటు వారిని ఎమోషనల్ కూడా చేసేస్తోంది. బాగా పాడారు, లిరిక్స్ బాగున్నాయంటూ ఈ పాటపై ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రేక్షకులు. ఈ పాటను హిందీలో కూడా చేయమని, కశ్మీర్ వాళ్లకు కూడా ఆ బాధ ఏంటో తెలుస్తుందని కొందరు రిక్వెస్ట్ చేస్తున్నారు.
ఆలోచింపచేసే పాట
ప్రణవి పాడిన ఈ పాటను కే వేద కంపోజ్ చేశారు. చైతన్య ప్రసాద్ అందించిన లిరిక్సే ఈ పాటను ప్రేక్షకులకు దగ్గర చేశాయి. ఏఐ ద్వారా క్రియేట్ చేసిన వీడియోనే అయినా పహల్గమ్ అటాక్ ఇలా జరిగుంటుందా అని కళ్లకు కట్టేలా చూపించారు. ఏఐ బాధ్యతలను సందీప్ కాట్రగడ్డ తీసుకున్నారు. అందరూ కలిసి పహల్గమ్ అటాక్ గురించి అందరికీ తెలిసే ఒక పాటను అందరికీ అందించారు. మతాలన్నీ మర్చిపోయి కలిసుంటే బాగుంటుంది అనే సందేశం కూడా ఈ పాటలో ఉంది. హిందూ, ముస్లిం అంటూ మతాల వల్ల, ఇండియా, పాకిస్థాన్ అంటూ సరిహద్దుల వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పాటలో చెప్తూ అందరినీ మరోసారి ఆలోచించేలా చేశారు.
Also Read: దానివల్లే డిస్టర్బ్ అయ్యాను, అందుకే అలా చేశాను.. క్లారిటీ ఇచ్చిన అమృత ప్రణయ్
టూరిస్టులపై దాడి
పహల్గమ్ అటాక్ విషయానికొస్తే.. ఏప్రిల్ 22న మధ్యాహ్నం 2 గంటలకు కశ్మీర్‌లోని పహల్గమ్ ప్రాంతంలో 26 మందిని హతమార్చారు ఉగ్రవాదులు. ఇండియన్ ఆర్మీకి, ఉగ్రవాదులకు ఒకరిపై ఒకరు తరచుగా కాల్పులు జరుపుకోవడం, అందులో పలువురు మరణించడం ఎప్పుడూ జరిగే విషయమే అయినా మొదటిసారి టూరిస్టులపై దాడి చేసి పాకిస్థాన్ ఉగ్రవాదుల వల్ల ఇండియాకు ఎంత ప్రమాదం పొంచి ఉందో బయటపడింది. 2019లో కూడా ఇలాంటి ఒక దాడే జరిగింది. పుల్వామాలో జరిగిన ఆ అటాక్‌లో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మరణించారు. ఆ అటాక్ తర్వాత 2025లో జరిగిన ఈ అటాక్ ఒక బ్లాక్ డేగా ఇండియన్ చరిత్రలో మిగిలిపోనుంది.